ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడితో ఆ దేశం అత‌లాకుత‌లం అవుతోంది. త‌మ‌ను చంపినా.. పిల్ల‌లు బ్ర‌తికితే చాల‌న్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు. తాజాగా పిల్ల‌ల వెన్ను భాగంలో వివ‌రాలు రాసిన ఫోటోలు ఇప్పుడు అక్క‌డి భ‌యానక ప‌రిస్థితికి నిద‌ర్శంగా మారాయి. ఓ జ‌ర్న‌లిస్టు ఆ ఫోటోల‌ను త‌న ట్వీట్‌లో పెట్టారు. వాస్త‌వానికి ఓ త‌ల్లి త‌న పిల్ల‌ల‌పై ఆ ఫ్యామిలీ వివ‌రాలు రాసింది. ఇన్‌స్టాలో ఆమె పెట్టిన పోస్టును త‌ర్జుమా చేసి ఓ జ‌ర్న‌లిస్టు ట్వీట్ చేశారు. ఓ అమ్మాయిపై ఆ పాప పేరును, టెలిఫోన్ నెంబ‌ర్‌ను రాసింది త‌ల్లి. కూతురు వీరా బ్ర‌తికితే, ఎవ‌రైనా ఆమెను శ‌ర‌ణార్థిగా స్వాగ‌తిస్తార‌న్న ఉద్దేశంతో ఇలా ఆమె రాశారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)