భారత్‌లో ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ (Russian Foreign Minister Sergey Lavrov) పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటిస్తుండడం ఆసక్తికరంగా మారింది. సెర్గీ రెండు రోజుల పాటు చైనాలో పర్యటిస్తున్నారు.

లావ్‌రోవ్ భారత పర్యటన యూఎస్‌ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దలీప్ సింగ్, బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌ల పర్యటనతో సమానంగా ఉండనున్నది. ట్రస్ గురువారం భారత్‌ను సందర్శించనుండగా.. దలీప్‌ సింగ్‌ బుధ, గురువారాల్లో భారత్‌లో పర్యటిస్తున్నారు. జర్మనీ విదేశీ, భద్రతా విధాన సలహాదారు జెన్స్ ప్లాట్నర్ భారత పర్యటన కొనసాగుతున్నది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)