స్వలింగ సంపర్కుల వివాహ బిల్లును అమెరికా సెనేట్‌ ఆమోదించింది. ఇక తుది ఆమోదం కోసం ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపిస్తారు. అనంతరం దేశాధ్యక్షుడు జోబైడెన్‌ బిల్లుపై సంతకం చేయడంతో అది చట్టంగా మారనున్నది. ఈ బిల్లు చట్టంగా మారిన వెంటనే స్వలింగ వివాహాలకు గుర్తింపు లభిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం వచ్చే ఏడాది జనవరి మాసాంతానికల్లా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటివరకు 32 దేశాలు మాత్రమే స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపునిచ్చాయి. 120 దేశాలు స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తున్నాయి.సెనేట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందడంపై అధ్యక్షుడు జో బైడెన్ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలో నివసిస్తున్న ప్రతి పౌరుడు తనకు నచ్చిన రీతిలో వివాహం చేసుకోవడానికి అనుమతించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Here's President Biden Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)