అమెరికాలో టెక్సాస్‌లోని సీలో విస్టా షాపింగ్‌ మాల్‌ (Cielo Vista Mall )లో గురువారం కాల్పుల ఘటన చోటు చేసుకుంది.ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా.. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.ముగ్గురిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కాల్పులకు తెగబడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి రాబర్ట్‌ గోమెజ్‌ (Robert Gomez) తెలిపారు. మరో నిందితుడికి కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.రెండు రోజుల క్రితం మిచిగ‌న్ స్టేట్ యూనివ‌ర్సిటీలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)