సౌత్‌ఆఫ్రికాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తర ప్రావిన్స్‌ లింపొపోలోని మమట్లకల సమీపంలో గురువారం(మార్చి 28) రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 45 మంది చనిపోయారని దేశ రవాణాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్నవారిలో ఒక్కరు తప్ప అందరూ మృతి చెందినట్లు ప్రకటించింది.ఈస్టర్‌ పండుగ నేపథ్యంలో చర్చికి వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు.

165 అడుగుల లోతులో పడిపోవడంతో బస్సులో మంటలు అంటుకున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. వారంతా బోట్స్‌వానా నుంచి మోరియోకు వెళ్తున్నారని వెల్లడించారు ప్రమాదంలో మరణించిన కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి. కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు వద్ద అదుపుతప్పడంతో బస్సు లోయలో పడిపోయిందన్నారు.ప్రమాద ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)