థాయ్ లాండ్ లో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం రెండుగా చీలిపోయింది. కొంత భాగం నుజ్జునుజ్జుగా మారిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికుల్లో 14 మంది స్పాట్ లోనే చనిపోగా.. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రచౌప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. వేగం కంట్రోల్ కాకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టిందని వివరించారు. అయితే, ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి విచారణ తర్వాతే ప్రమాదానికి అసలు కారణం తెలుస్తుందని అధికారులు వివరించారు.
Here's Video
#Thailand | A bus lost control and crashed into a tree in Thailand, killing 14 passengers and injuring more than 20 early on Tuesday.
The accident occurred in the country's western province of Prachuap Khiri Khan at half past midnight. pic.twitter.com/gYxi33fLrY
— DD India (@DDIndialive) December 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)