అమెరికాలో టోర్నోడోలు పెను విధ్వంసం సృష్టించాయి. మిస్సిస్సిపిలో శుక్రవారం అర్థరాత్రి బలమైన గాలులు, ఉరుములతో కూడిన తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో పరిసర ప్రాంతాలన్ని చిగురుటాకులా వణికిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 23 మంది దాక ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది జనాలు తీవ్రంగా గాయపడ్డారు.మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు చెప్పారు. ఈ టోర్నోడోల కారణంగా భారీ నష్టం జరిగిందని సుమారు 160 కి.మీ వరకు ప్రభావం చూపిందని అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.ప్రస్తుతం అక్కడ కూడా సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టినట్లు పేర్కొన్నారు.తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శుక్రవారం రాత్రంతా జనం అంధకారంలోనే మగ్గిపోయారు.
Here's Video
At least 7 killed after tornado devastates Rolling Fork, Mississippi - WAPT pic.twitter.com/25YnN1V2SK
— BNO News Live (@BNODesk) March 25, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)