ఉగాండా రాజధాని కంపాలా (Kampala)లో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్‌ కల్నల్‌ (Retired Colonel ) చార్లెస్‌ ఎంగోలా (Charles Engola) నివాసంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ వివాదంలో ఆయన వద్ద పనిచేసే బాడీగార్డు మంత్రిని కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అంగరక్షకుడు సైతం తనను తాను కాల్చుకుని మృతి చెందాడు.

అయితే, మంత్రి వద్ద బాడీగార్డ్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తికి చాలా కాలంగా వేతనాలు చెల్లించడం లేదని సమాచారం. ఈ కారణంతోనే మంత్రిని గార్డు కాల్చి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.ఎంగోలా హత్యకు దారితీసిన కారణాలు ఏమిటనేది దర్యాప్తులో తేలుతుందని ఆర్మీ ప్రతినిధి (army spokesperson) ఫెలిక్స్‌ కులాయిగ్వే ( Felix Kulayigye) పేర్కొన్నారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)