ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. అయితే రష్యా దాడిని ఉక్రెయిన్‌ సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. లుహాన్స్‌ రీజియన్‌లో రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్‌ను కూల్చివేశామని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. అధ్యక్షుడు పుతిన్‌ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన కొద్ది సేపట్లోనే ఆ దేశంలోని ప్రధాన నగరాలపై రష్యా సైన్యం శక్తివంతమైన బాంబులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా ల్వీవ్‌, ఖార్కివ్‌, మర్యుపోల్‌ నగరాలపై బాంబు దాడులు చేస్తున్నది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)