యుఎస్ ఎయిర్ రేసింగ్ సందర్భంగా రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అమెరికాలోని నెవడా రాష్ట్రంలో జరిగిందీ ఘటన. ఇక్కడి రెనో ఎయిర్ రేసింగ్‌లో విమానాలు ఒకదాన్నొకటి ఢీకొన్నట్టు ఎయిర్ రేసింగ్ అసోసియేషన్ తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు విమానాలు ఢీకొన్నట్టు పేర్కొంది. ప్రమాదంలో మరణించిన పైలట్ల వివరాలు తెలియాల్సి ఉంది.
రెనోలో నిర్వహించిన నేషనల్ చాంపియన్‌షిప్ ఎయిర్ రేస్ చివరి రోజు ఈ ఘటన సంభవించింది. విమానాలు ల్యాండవుతున్న సమయంలో ఢీకొన్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో మరెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు.
Here's Video
🚨 BREAKING: Two pilots were killed when their planes collided upon landing at the National Championship Air Races in Reno, Nevada pic.twitter.com/lj8U7KFSaP
— Daily Viral (@DailyviralUS) September 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)