అమెరికాలో క్రిస్మస్ పండగ వేళ కూడా కాల్పులు జరిగాయి. కొలరాడోలోని సిటాడెల్ మాల్‌లో ఆదివారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ షాపింగ్‌ సందడిలో బిజీగా ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిగాయి. ఒక ఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణలో భాగంగా ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు.

ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పోలీసు అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని, తీవ్రంగా గాయపడిన బాధితులను తక్షణమే హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు.మరోవైపు శనివారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని ఓకాలా వద్ద ఓ మాల్‌ వద్ద కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా ఒక మహిళ గాయపడినట్లు ఓకాలా పోలీస్ చీఫ్ మైక్ బాల్కెన్‌ వెల్లడించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)