భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ విజయ్‌ జోల్‌ కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు. జోల్‌తో పాటు అతని సోదరడు విక్రమ్‌ జోల్‌, మరో 18 మంది తనను కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు పాల్పడి, దోపిడి చేసినట్లు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ ఒకరు మహారాష్ట్రలోని ఔరంగబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మరోవైపు సదరు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌పై కూడా ఓ వ్యక్తి (ఈ కేసులో నిందితుల్లో ఒకరు) ఫిర్యాదు చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ పేరిట సదరు మేనేజర్ తమను లక్షల మేర మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అతనిపై సైతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.2014లో భారత అండర్‌-19 టీమ్‌ కెప్టెన్‌గా ఎంపికైన 28 ఏళ్ల విజయ్‌ జోల్‌.. మహారాష్ట్ర, ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (యూత్‌ కాంట్రాక్ట్‌) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)