అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. కానీ టీ20, టీ10 లీగ్‌లు ఆడుతానని పొలార్డ్ స్పష్టం చేశాడు. 2007లో వన్డేల్లో అరంగేట్రం చేసిన పొలార్డ్ విధ్వంసకర ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ‘అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికేందుకు నిర్ణయించుకున్నా.
పదేండ్ల వయసులో విండీస్ జట్టు తరఫున ఆడాలని కలలు కన్నా. జాతీయ జట్టుకు 15 ఏండ్ల పాటు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నా’ అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. 34 ఏండ్ల పొలార్డ్ మొత్తం 123 వన్డేలు ఆడి 55 వికెట్లు పడగొట్టగా.. 2,706 పరుగులు చేశాడు. 101 టీ20ల్లో 1,569 రన్స్, 42 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతడు చివరిసారి భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆడడం గమనార్హం.
Polly , you will always be entertainer in the T20s ... Thanks for entertaining us with your innings of 6 sixes in 6 balls.
For me, this is the best entertaining innings for Kieron Pollard. pic.twitter.com/bmjfz96fQe
— Johns. (@CricCrazyJ0hns) April 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)