MS Dhoni and Sakshi |(Photo Credits: Twitter)

మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) భారత క్రికెట్లో ఒక చెరగని ముద్ర, ఆయన ఒక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడంటే తన ఆదేశాలు జట్టు సభ్యులందరూ పాటించాల్సిందే. క్రికెట్ ప్రపంచంలో ధోని ఒక ఆదర్శవంతమైన కెప్టెన్, వికెట్ కీపర్- క్రికెటర్ (Ideal Cricketer), ఇది అందరికీ తెలిసిందే. అయితే  రియల్ లైఫ్ లో కూడా తాను ఒక ఆదర్శవంతమైన భర్త  (Ideal Husband) అని ధోనీ చెప్తున్నాడు. ఎందుకంటే అతడు తన భార్య ఆదేశాలన్నీ తుమ్మినా, చ్చినా తప్పకుండా పాటిస్తాడంట.

తన వివాహానంతర జీవితం గురించి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన ఒక సరదా ప్రసంగానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ మ్యాట్రిమోనియల్ సంస్థ 'భారత్ మ్యాట్రిమోనియల్' ఇటీవల చెన్నైలో ఒక పబ్లిక్ ఈవెంట్ నిర్వహించింది. ఆ మ్యాట్రిమోనియల్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ధోని, ఆ ఈవెంట్ కు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఒక ఆదర్శ భర్త ఎలా ఉండాలి? అనే దానిపై స్పీచ్ ఇచ్చాడు. తన భార్య సాక్షితో వివాహానంతరం జీవితం ఎలా ఉందో ధోని అక్కడున్న వారితో పంచుకున్నారు. తనని తాను ఒక ఆదర్శవంతమైన భర్తగా ధోని అభివర్ణించుకున్నాడు. తన భార్య ఏది కోరినా అందుకు అంగీకరిస్తానని తెలిపాడు. భార్యలు సంతోషంగా ఉంటేనే భర్తలు కూడా సంతోషంగా ఉంటారన్నారు. అయితే పెళ్లయింత వరకే మగవారు సింహాలని చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. ధోని మాటలకు అక్కడున్నవారంత పడీపడీ నవ్వారు.

ధోనీ మాటల్లో.." నేనొక ఆదర్శవంతమైన భర్తను, కాదు అంతకంటే ఎక్కువే. నా భార్య ఏదీ కోరినా అందుకు నేను అంగీకరిస్తాను. ఎందుకంటే నాకు తెలుసు, భార్యలు సంతోషంగా ఉంటేనే భర్తలు కూడా సంతోషంగా ఉంటారని. అయితే నా భార్య ఏది చెప్పినా, నా నుంచి అవును అని సమాధానం వచ్చినపుడే ఆమె సంతోషపడుతుంది. కాబట్టి ఆమె చెప్పేవాటికి అన్నింటికి నేను 'ఎస్' (yes) అంటూ పోతాను. ఇది నా ఒక్కడి స్టోరీ మాత్రమే కాదు, భర్తలందరిదీ ఇదే స్టోరీ, సాధారణంగా మగవాళ్లందరూ సింహాలే.... పెళ్లి కానంతవరకు". అని చెప్పాడు.

ధోనీ ఆదర్శ భర్త సిద్ధాంతం వీడియో:

 

ధోనీ మాటలు వింటే మీకు తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన  F2 సినిమా గుర్తుకు వచ్చే ఉంటుంది. అందులో కూడా భార్యలు ఏం చెప్పినా "అంతేగా.. అంతేగా" అనే భర్తల్లాగా, ధోనీ కూడా తన భార్య సాక్షి ధోనీ ఏది చెప్పినా అంతేగా... అంతేగా అంటూ పోతాడన్నమాట. అందుకే పెళ్లికానంత వరకే మగాళ్లు సింహాలు అని చెప్పుకొచ్చాడు కాబోలు.

ఎంఎస్ ధోని, అతడి భార్య సాక్షి (Sakshi Dhoni) ఇద్దరు ఒకరినొకరు 2010 లో వివాహం చేసుకున్నారు. ఈ జంట భారతదేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖ జంటలలో ఒకరు. వీరికి నాలుగేళ్ల కుమార్తె జివా ధోని  (Ziva Dhoni) కూడా ఉంది.

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే, వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరగబోయే ఆసియా ఎలెవన్ vs రెస్ట్ ఆఫ్ వరల్డ్ (Asia XI vs Rest of World ) టోర్నమెంట్‌ ద్వారా ఎంఎస్ ధోని రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తాజా నివేదికల ప్రకారం వెల్లడవుతుంది. 2020 మార్చిలో జరిగే రెండు మ్యాచ్‌ల టీ-20 ఐ టోర్నమెంట్‌లో ఎంఎస్ ధోని ఆడేందుకు అనుమతించాలని కోరుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) బిసిసిఐకి లేఖ విడుదల రాసింది. ధోనీతో పాటు మరో ఏడుగురు భారతీయ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా లను ఈ మ్యాచ్‌లు ఆడటానికి అనుమతించాలని బిసిబి కోరింది. మొదటి టీ-20 మ్యాచ్ మార్చి 18 న, రెండో టీ-20 మార్చి 21న షెడ్యూల్ చేయబడ్డాయి.