టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను హర్యానా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం కొద్దిసేపటికే యువీని బెయిల్‌పై విడుదల చేశారు.గతేడాది జూన్‌లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్‌లో పాల్గొన్న యువరాజ్.. తోటి క్రికెటర్ చహల్‌ను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ సమయంలో చహల్ సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ.. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వివాదంపై స్పందించిన యువరాజ్.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లో ట్వీట్ చేశారు. అయితే, యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని ఆరోపిస్తూ ఓ న్యాయవాది హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై ఈ ఏడాది లాక్‌డౌన్ అనంతరం విచారణ జరిపిన హిస్సార్ పోలీసులు.. యువరాజ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసారు.
#BREAKING #BreakingNews #YuvrajSingh @YUVSTRONG12 arrested by @hansi_police and released on interim bail. Accused of casteist slur against #cricketer @yuzi_chahal while on video chat with @ImRo45 last year. He had issued an apology also#IPL2021 @RCBTweets @mipaltan pic.twitter.com/Sysdsf3sKg
— Sumedha Sharma (@sumedhasharma86) October 17, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)