Romania Wrestler Injured

Paris, AUG 10:  ఒలింపిక్స్‌లో దేశానికి పత‌కం అందించాల‌నే ఓ రెజ్ల‌ర్ (Wreaslig) క‌ల చెదిరింది. ప్రత్య‌ర్థి అమాంతం ఎత్తి ప‌డేయంతో ఊహించ‌ని విధంగా ఆమె గాయ‌ప‌డింది. మ‌హిళ‌ల ఫ్రీ స్ట‌యిల్ 76 కిలోల విభాగం 16వ రౌండ్‌లో రొమేనియా రెజ్లర్ క‌ట‌లినా అక్సెంటే (Catalina Axente) తీవ్ర గాయాల‌పాలైంది. శ‌నివారం ఉద‌యం జ‌రిగిన బౌట్ స‌మ‌యంలో అమెరికా రెజ్ల‌ర్ కెన్నెడీ బ్లేడ్స్ (Kennedy Blades) ఆమెను అమాంతం ఎత్తి మ్యాట్ మీద ప‌డేసింది. దాంతో, క‌ట‌లినా మెడ‌కు తీవ్ర గాయ‌మైంది. ఊహించ‌ని ప‌రిణామంతో షాక్ తిన్న ఆమెను ఒలింపిక్స్ (Olympics) సిబ్బంది స్ట్రెచ‌ర్ మీద త‌ర‌లించి అత్య‌వ‌స‌ర వైద్యం అందించారు.

 

యూరో చాంపియ‌న్‌షిప్స్‌లో రెండుసార్లు కాంస్యం నెగ్గిన అక్సెంటే, అమెరికా కెర‌టం కెన్నెడీకి గ‌ట్టి పోటీనిచ్చింది. అయితే.. మొద‌టి రౌండ్‌లో 6-0తో ఆధిక్యం సాధించిన అమెరికా రెజ్ల‌ర్ ఆ త‌ర్వాత రెచ్చిపోయింది. అక్సెంటీని వెన‌క‌నుంచి అదిమి ప‌ట్టుకొని అలానే వెన‌క్కి ఎత్తి కింద ప‌డేసింది. దాంతో, అక్క‌డున్న‌వాళ్లంతా ఒకింత షాక్‌కు గుర‌య్యారు. మెడ‌కు గాయంతో బాధ‌ప‌డుతున్న‌ అక్సెంటీని ఒలింపిక్స్ సిబ్బంది స్ట్రెచ‌ర్ మీద తీసుకెళ్లి వైద్యం అందించారు. అయితే.. ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? అనేది ఇంకా తెలియ‌లేదు.