Vijayawada, July 13: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు (Heavy Rains in AP) కురవనున్నాయి. నేడు, రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో వానలు పడనున్నాయి. ఇక, సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావానికి తోడు, ఈశాన్య అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ లో దంచికొట్టిన వాన, ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం
వానలే.. వానలు
శుక్రవారం ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, వైఎస్సార్, అన్నమయ్య తదితర జిల్లాల్లో మంచి వానలు పడ్డాయి.
హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్ దారుణ హత్య, నిర్మానుష్య ప్రాంతంలో ముక్కలుముక్కలుగా నరికి చంపిన దుండగులు