Adilabad, AUG 12: సైబర్ క్రిమినల్స్ (Cyber criminals) రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులే టార్గెట్ గా సైబర్ నేరాలకు (Cyber crimes) పాల్పడుతున్నారు. తాజాగా అందమైన అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ (Nude calls) చేయించి యువకులను రెచ్చగొడుతున్నారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ చీటింగ్ గ్యాంగ్ రెచ్చిపోయింది. అందమైన అమ్మాయిలతో యువకులకు న్యూడ్ కాల్స్ (Nude calls) చేయించి ఆ కాల్స్ ను రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత ఆ వీడియోను అడ్డం పెట్టుకుని తమకు డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ కు (Black mail) పాల్పడుతున్నారు సైబర్ చీటర్స్. డబ్బులు ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ తరహా మోసాలపై పోలీసులు మరోసారి అలర్ట్ చేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ (Video calls) వస్తే అప్రమత్తంగా ఉండాలని, వాటిని లిఫ్ట్ చేయొద్దని సూచించారు.
నార్త్ ఇండియాకు చెందిన యువతులు.. ఉత్తర తెలంగాణకు చెందిన యువకులతో పాటు ప్రొఫెషనల్స్ ను టార్గెట్ చేస్తున్నారు. తొలుత పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత న్యూడ్ కాల్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వాటిని రికార్డ్ చేయడం మొదలుపెడతారు. వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ కు దిగుతారు. డబ్బు పంపాలని డిమాండ్ చేస్తారు. లేదంటే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తారు.
అంతేకాదు ఫోన్ చేసి మేము పోలీసులం అంటూ బెదిరింపులకు దిగుతారు. ఈ తరహా బ్లాక్ మెయిల్ కేసులు ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. సైబర్ చీటర్స్ బారిన పడిన వారిలో కొందరు యువకులు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. వారిలో ఇద్దరు లాయర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తమ పరువు పోతుందనే భయంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఉండిపోతున్నారు. అయితే, ఫిర్యాదు రూపంలో కాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.