Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు, మే 14 వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు, ప్రజ్వల్‌ రేవణ్ణ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో మంగళవారం కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు.

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు, మే 14 వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు, ప్రజ్వల్‌ రేవణ్ణ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
BRS Leader K Kavitha (File Image)

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో మంగళవారం కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 14న కవితను కోర్టులో హాజరు పర్చాలని ఆదేశించారు.

లిక్కర్‌ కేసులో జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజ్వల్‌ రేవణ్ణ కేసుపై స్పందించారు. సోమవారం కస్టడీ ముగిసిన సందర్భంగా కవితను రౌస్‌ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద కవిత మీడియాతో మాట్లాడారు.ప్రజ్వల్‌ రేవణ్ణ లాంటి వాళ్లను విడిచిపెట్టి దేశం దాటించి తనలాంటి వాళ్లను అరెస్ట్‌ చేశారన్నారు. ఇది అన్యాయమని, దీనిని అందరూ గమనించాలని కవిత కోరారు.  మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్, జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు

మరోవైపు కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని ·కూడా రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మార్చి 15న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక లిక్కర్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)దూకుడు ప్రదర్శిస్తోంది. లిక్కర్‌ కేసులో కవిత పాత్రపై వారంరోజుల్లో చార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది.

(The above story first appeared on LatestLY on May 07, 2024 05:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).