Hyderabad Gangrape Case: పోర్న్ వీడియోలు చూసే అత్యాచారం, ఆ అమ్మాయి అమాయకంగా.. అందుకే కండోమ్‌తో ఈ దారుణానికి ఒడిగట్టాం జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో మైనర్ల షాకింగ్ విషయాలు
Hyderabad Gang-Rape Case (Photo-videograb/ANI)

Hyd, June 14: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో (Hyderabad Gangrape Case) రోజు రోజుకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో మైనర్ల క్రూరత్వం వెలుగులోకి వచ్చింది. ఆ రోజు పబ్ లో ఏం జరిగిందనే దానిపై ఇద్దరు మైనర్లు కస్టడీలో పోలీసులకు చెప్పారు. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లోని అశ్లీల దృశ్యాలే అత్యాచారానికి ప్రేరణ అని మైనర్లు విచారణలో చెప్పారు.

పబ్ లో ఆ అమ్మాయి అమాయకంగా కనిపించడంతో బాధిత బాలికతో పాటు మరో బాలికతో మైనర్లు మాట కలిపారు. అందరూ కలిసే అత్యాచారం చేశామని మైనర్లు అంగీకరించారు. అత్యాచారం సమయంలో ఆ అమ్మాయికి గర్భం వస్తుందనే అనుమానంతో అందరూ కండోమ్ వాడామని వారు చెప్పినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వాళ్లు కండోమ్స్ ఎక్కడ నుండి తీసుకువచ్చారనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు.

జూబ్లీహిల్స్‌ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ పోలీస్‌ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు ( Jubilee Hills rape clinically planned) వెలుగు చూశాయి. ఈ కేసులో శాస్త్రీపురం కార్పొరేటర్‌ కుమారుడు అసలు సూత్రధారి అని సాదుద్దీన్‌ పోలీసులకు వివరించాడు. కార్పొరేటర్‌ కుమారుడు, ఎమ్మెల్యే కొడుకు పబ్‌లోకి ఎంటర్‌ కాగానే అమ్మాయిలను వెతకడం ప్రారంభించారని, పబ్‌లోనూ మైనర్‌ అమ్మాయిలను వేధించినట్లు పేర్కొన్నాడు. ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు బాలిక వెంటపడ్డారని సాదుద్దీన్ చెప్పాడు. ఫ్రెండ్స్ బలవంతం చేయడంతోనే తాను బాలికను రేప్ చేసినట్లు సాదుద్దీన్ వెల్లడించాడు.

జులాయి తిరుగుడు..పెళ్లి చేయలేదని తండ్రిని కొడవలితో నరికి చంపేసిన శాడిస్ట్ కొడుకు, అదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన

పబ్‌ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్‌ కొడుకు మైనర్‌ వెంట పడ్డారు. నేను వారిని వద్దని వారించాను. దీంతో నన్ను బెంజ్ కారులో ఎక్కొద్దని ఎమ్మెల్యే కొడుకు ఆదేశించాడు. నన్ను పబ్‌ దగ్గర వదిలి అమ్మాయిని బెంజ్‌ కారులో ఎక్కించుకున్నాడు. నేను బెంజ్‌ కారులో కాకుండా ఇన్నోవాలో బేకరికి వెళ్లాను. బెంజ్ కారులోకి ఎక్కగానే మైనర్ అమ్మాయిని ఏమ్మెల్యే కుమారుడు వేధించడం ప్రారంభించాడు. మార్గ మధ్యలో ఇద్దరు, మరొక ముగ్గురు పెద్దమ్మతల్లి ఆలయం పక్కన ఖాళీ స్థలంలో అఘాయిత్యానికి ఒడిగట్టారు. నా ఫ్రెండ్స్‌ బలవంతం కారణంగానే నేనూ ఈ అత్యాచారం చేయాల్సి వచ్చింది. వారి ప్రోద్బ‌లంతోనే ఇదంతా జరిగింది’ అని సాదుద్దీన్‌ పోలీసుల ముందు తెలిపాడు.

మరోవైపు జూబ్లీహిల్స్‌ పబ్‌ కేసులోని నిందితుల మధ్య ఘర్షణ జరిగింది. జువైనల్‌ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లు ప్లేట్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్‌ కుమారుడు సాదుద్దీన్‌ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. నీ వల్లే విషయం బయటకు వచ్చిందని సాదుద్దీన్‌పై మిగతా నిందితులు దాడి చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో పోలీసులు సంచలన నిర్ణయం, ట్రయల్‌ సమయంలో వారిని మేజర్‌లుగా పరిగించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు విన్నపం

ముగ్గురు మైనర్లకు ఇవాళ (జూన్ 14), మరో ఇద్దరు మైనర్లకు రేపటితో (జూన్ 15) కస్టడీ విచారణ ముగియనుంది. నిన్న(జూన్ 13) కస్టడీ ముగియడంతో ఏ-1 నిందితుడు సాదుద్దీన్ ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.అమ్నీషియా పబ్‌ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో నాంపల్లి కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు సాదుద్దీన్‌ను తరలించారు. బాధితురాలు మైనర్ అయినందున వల్ల పోక్సో చట్టం ప్రకారం ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

నిందితులను విచారిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు చార్జిషీట్ సమర్పించేందుకు వీలుగా వేగంగా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. పోక్సో చట్టం ప్రకారం ప్రతి కేసులోనూ 60 రోజుల్లోగా అభియోగపత్రం సమర్పించాలనే నిబంధన ఉండటంతో అందులో పొందుపరచాల్సిన అంశాలపై పోలీసుల ఫోకస్ పెట్టారు. పక్కా ఆధారాలతో ఈ కేసులో మైనర్ నిందితులకు పెద్ద శిక్షలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు ఎవిడెన్స్ సేకరించినట్లు సమాచారం.

అంతా ముందుగానే ప్లాన్.. ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం, జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసు వివరాలను వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్

తనపై కారులో ఐదుగురు అత్యాచారం చేశారని బాలిక ఇదివరకే స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆ వాంగ్మూలానికి తగ్గట్టుగా పబ్ నుంచి బేకరీకి, బేకరీ నుంచి అత్యాచారం జరిగిన ప్లేస్ కు, ఇదంతా రికార్డ్ అయిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సంపాదించారు. వారంతా బాలికతో కలిసి ఉన్నారనడానికి ఇవి పక్కా ఆధారాలు. అంతేకాకుండా ఘటన జరిగిన స్థలంలో ఆ సమయంలో నిందితులు అక్కడే ఉన్నట్లు బాధిత బాలికతో పాటు వారి సెల్ ఫోన్ టవర్ లొకేషన్ డేటాను కూడా పోలీసులు సేకరించారు.