Hyderabad Gang Rape Case: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో పోలీసులు సంచలన నిర్ణయం, ట్రయల్‌ సమయంలో వారిని మేజర్‌లుగా పరిగించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు విన్నపం
Hyderabad Gang-Rape Case (Photo-videograb/ANI)

Hyd, June 9: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో (Hyderabad Gang-Rape Case) పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యాచారం కేసు నిందితులను ట్రయల్‌ సమయంలో మేజర్‌లుగా ( Police Want 5 Minors Tried As Adults) పరిగణించాలని పోలీసులు జువైనల్‌ జస్టిస్‌ బోర్డును కోరారు. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తర్వాత ట్రయల్‌ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌లుగా పరిగణించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు హైదరాబాద్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు పోలీసుల వినతిపై జువైనల్‌ జస్టిస్‌ బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడానికి వారికి ఉన్న సామర్థ్యం అన్నిటిని పరిగణలోకి తీసుకొని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు నిర్ణయం వెల్లడించనుంది. మైనర్లకు 21 ఏళ్లు దాటిన తర్వాత వారిని జువైనల్‌ హోం నుంచి సాధారణ జైలుకు తరలించనున్నారు.

బాధితురాలి రెండోసారి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి వద్ద దింపుతామని ట్రాప్‌ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు వెల్లడించింది. బాధితురాలిని వెంబడించి క్యాబ్‌ బుక్‌ చేస్తామంటూ నిందితులు ఫోన్‌ లాక్కున్నారు. ఫోన్‌ సిగ్నల్‌ సరిగా లేదని.. ఇంటి వద్ద డ్రాప్‌ చేస్తామంటూ బెంజ్‌ కారులో  తీసుకెళ్లిన నిందితులు.. బాధితురాలి హ్యాండ్‌ బ్యాగ్‌, కళ్లజోడు లాక్కున్నారు. కాన్స్‌ బేకరీ వద్దకు రాగానే ఇన్నోవాలోకి షిఫ్ట్‌ చేశారు. ఇన్నోవాలో తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది.

అంతా ముందుగానే ప్లాన్.. ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం, జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసు వివరాలను వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్

ఈ కేసులో పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడితోపాటు మరో మైనర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం జువైనల్‌ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జువైనల్‌ హోమ్‌కు తరలించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుప్పాలగూడ వాసి సాదుద్దీన్‌ను కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇచి్చంది. మిగతా ఐదుగురు మైనర్లనూ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడిన ముగ్గురు మైనర్లను సైదాబాద్‌లోని జువైనల్‌ హోమ్‌లో ఉంచారు. తాజాగా ఎమ్మెల్యే కుమారుడు, మరో మైనర్‌నూ కోర్టు ఆదేశాల మేరకు బుధవారం అదే హోమ్‌కు తరలించారు.