Hyderabad, May 02: తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా (Temperatures) నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో జనం వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లా గూడపూర్‌లో 46.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో 47 డిగ్రీల మార్క్‌ను దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. గురువారం నుంచి శనివారం వరకు దీర్ఘకాల వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను (Orange Alert) జారీ చేసింది. అలాగే, ఈ నెల 6 నుంచి రాష్ట్రంలో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
7-day forecast(EVENING) of TELANGANA based on 0900 UTC issued at 1730 hours IST Dated :02/05/2024@CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @CommissionrGHMC @HYDTP @IasTelangana @tg_weather #ECISVEEP pic.twitter.com/a06Mlwf0jo
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 2, 2024
గురువారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు కొనసాగుతాయని హెచ్చరించింది. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడ వడగాలులు వీస్తాయని చెప్పింది. ఈ నెల 6న రాష్ట్రం నుంచి పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం (Rains In Telangana) నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.