Telangana Budget 2020 Highlights: రూ.25వేల వరకు ఒకేసారి రైతు రుణమాఫీ, రైతు బంధు పథకానికి రూ.14 వేల కోట్లు, రూ.1,82,914.42 కోట్లతో టీఎస్ బడ్జెట్, ఆర్థిక మంత్రిగా తొలిసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన హరీష్ రావు

రాష్ట్ర వార్షిక బడ్జెట్(2020-21) ను (Telangana Budget 2020) ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు (Telangana Finance minister T Harish Rao) నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ఆర్థిక మంత్రిగా హరీష్ రావు తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను (TS Budget 2020-21) ప్రవేశపెట్టారు. కాగా, బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి వచ్చే ముందు హరీష్ రావు గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు.

Telangana Budget 2020 Highlights: రూ.25వేల వరకు ఒకేసారి రైతు రుణమాఫీ, రైతు బంధు పథకానికి రూ.14 వేల కోట్లు, రూ.1,82,914.42 కోట్లతో టీఎస్ బడ్జెట్, ఆర్థిక మంత్రిగా తొలిసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన హరీష్ రావు
Telangana Finance minister T Harish Rao (Photo-Youtube Grab)

Hyderabad, Mar 08: రాష్ట్ర వార్షిక బడ్జెట్(2020-21) ను (Telangana Budget 2020) ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు (Telangana Finance minister T Harish Rao) నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ఆర్థిక మంత్రిగా హరీష్ రావు తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను (TS Budget 2020-21) ప్రవేశపెట్టారు. కాగా, బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి వచ్చే ముందు హరీష్ రావు గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు.

ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్, దమ్ము లేకనే పారిపోయారంటూ కేసీఆర్ ధ్వజం

టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019-20 ఆర్థిక బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రవేశపెట్టగా, శాసన మండలిలో హరీష్ రావు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్ అంచనా రూ. 1, 82, 914.42 కోట్లుగా వెల్లడించారు. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించారు. ప్రధానమైన వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించింది. అందులో ప్రధానమైన రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల 225 కోట్లు, రైతు బీమా కోసం రూ. 1, 141 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

Here's TS Budget Live 

తెలంగాణా బడ్జెట్ హైలెట్స్

"2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్.

రెవెన్యూ వ్యయం : 1, 38, 669.82 కోట్లు.

రెవెన్యూ మిగులు : 4,482.12 కోట్లు.

ఆర్థిక లోటు రూ. 33, 191.25 "

గత సంవత్సరం రెవెన్యూ వృద్ధి రేటు 16 నుంచి 6 శాతానికి తగ్గింది.

గత సంవత్సరం బడ్జెట్‌లో లక్షా 36 వేలు ఖర్చు.

రైతు బంధు పథకానికి రూ. 14 వేల కోట్లు.

హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10వేల కోట్లు

సీఏఏపై చర్చకు రెడీ, అన్ని పార్టీల వారికి అవకాశం కల్పిస్తాం

-రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు..

-రైతుబంధు పథకం కోసం రూ. 14 వేల కోట్లు.

-రైతు బీమా కోసం రూ. 1,141 కోట్లు.

-విద్యుత్‌ శాఖకు రూ. 10,416 కోట్లు.

-సాగునీటి రంగానికి రూ. 11,054 కోట్లు..

-రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు..

-ఒక్కో రైతు వేదికకు రూ. 12 లక్షలు కేటాయింపు..

-బిందు, తుంపర సేద్యానికి రూ. 600 కోట్లు.

-విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్లు..

-పాడి రైతుల ప్రోత్సాహం కోసం రూ. 100 కోట్లు..

-మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ కోసం రూ. 1000 కోట్లు.

మైక్రో ఇరిగేషన్ కోసం రూ. 600 కోట్లు.

రైతు మద్దతు ధర కోసం రూ. 1000 కోట్లు.

రైతు వేదికల నిర్మాణం కోసం : రూ. 350 కోట్లు.

సంక్షేమ పథకాలు..

-ఆసరా పెన్షన్లకు రూ. 11,758 కోట్లు.

-ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 16,534.97 కోట్లు.

-ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 9,771.27 కోట్లు.

-మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం రూ. 1,518.06 కోట్లు.

విద్యా రంగం

-ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం రూ. 2,650 కోట్లు.

-పాఠశాల విద్యాశాఖకు రూ. 10,421 కోట్లు.

-ఉన్నత విద్యాశాఖకు రూ. 1,723.27 కోట్లు.

-సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ. 100 కోట్లు.

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు

వైద్య రంగం

-వైద్య రంగానికి రూ. 6,186 కోట్లు.

వెనుకబడిన తరగతుల కోసం..

-వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం రూ. 4,356.82 కోట్లు

-పశు పోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు.

-కల్యాణలక్ష్మి - బీసీల కోసం అదనపు నిధుల కింద రూ. 1,350 కోట్లు.

-ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు.

-మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 1,200 కోట్లు.

-పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కోసం రూ. 23,005 కోట్లు.

-పట్టణ మిషన్‌ భగీరథ పథకం కింద మిగిలిపోయిన 38 మున్సిపాలిటీలకు రూ. 800 కోట్లు.

-మున్సిపల్‌ శాఖకు రూ. 14,809 కోట్లు.

-హైదరాబాద్‌ నగరంలో ప్రాజెక్టుల అమలు కోసం రూ. 10 వేల కోట్లు.

-ఇండస్ట్రీయల్‌ ఇన్సెంటివ్స్‌ కోసం రూ. 1,500 కోట్లు.

-పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రూ. 1,998 కోట్లు.

-ఆర్టీసీకి రూ. 1000 కోట్లు.

-గృహ నిర్మాణాల కోసం రూ. 11,917 కోట్లు.

-పర్యావరణ, అటవీశాఖకు రూ. 791 కోట్లు.

-దేవాలయాల అభివృద్ధి కోసం రూ. 500 కోట్లు.

-కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణాలను పూర్తి చేయడం కోసం రూ. 550 కోట్లు.

-రోడ్లు, భవనాల శాఖకు రూ. 3,494 కోట్లు.

-పోలీసు శాఖకు రూ. 5,852 కోట్లు.

-ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్డీపీ నిధుల కోసం రూ. 480 కోట్లు.

సాగునీటి పారుదల రంగానికి : రూ. 11, 054 కోట్లు.

ఎంబీసీ కోసం : రూ. 500 కోట్లు.

అన్ని రకాల పెన్షన్ల కోసం : రూ. 11, 758 కోట్లు.

హరిత హారం కోసం : రూ. 791 కోట్లు.

(The above story first appeared on LatestLY on Mar 08, 2020 01:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).