CM KCR on CAA: సీఏఏపై చర్చకు రెడీ, అన్ని పార్టీల వారికి అవకాశం కల్పిస్తాం, పార్లమెంట్‌లోనే సీఏఏను వ్యతిరేకించాం, తనకే 'బర్త్ సర్టిఫికేట్ లేదు' అని శాసనసభలో ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్
File image of Telangana CM KCR | File Photo

Hyderabad, Mar 07: CAAపై చర్చ జరగాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టం చేశారు.రాష్ట్ర శాసనసభలో చర్చించి తీర్మానం చేద్దామని శాసనసభలో (Telangana Assembly) తెలిపారు. ఇది దేశాన్ని కుదిపేస్తున్న అంశమని, సీఏఏపై అనుమానాలున్నాయన్నారు. అలాగే భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. రెండో రోజు ప్రారంభమైన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సీఏఏను (Citizenship Amendment Act) వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయని గుర్తుచేశారు. సీఏఏను పార్లమెంటులోనే టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించినట్లు పేర్కొన్నారు. ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏపై దేశంలో అతిపెద్ద చర్చ జరుగుతోందని తెలిపారు. ఇక జీఎస్టీ డబ్బులు కేంద్రం నుంచి రావట్లేదని సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం. పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని కుదిపేస్తోంది. సీఏఏపై చర్చ ఒకరోజుతో అయ్యేది కాదు. సీఏఏపై చర్చ అంటే అంతర్జాతీయ స్థాయిలో దేశభవిష్యత్‌ గురించి మాట్లాడటమేనని అన్నారు.

సీఏఏపై అందరి సభ్యులకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరుతున్న. ఎవరి అభిప్రాయం వారు వెల్లడించొచ్చు. సీఏఏ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా సవివరంగా మాట్లాడొచ్చు. సీఏఏ చాలా కీలకమైన అంశం, దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలన్నారు. నేను మా ఊరిలో మా సొంత ఇంట్లో పుట్టాను, అప్పట్లో మా ఊరిలో ఆసుపత్రి లేదు, నాకే బర్త్ సర్టిఫికేట్ కూడా లేదు. నాకే ధ్రువీకరణ పత్రం లేనపుడు నా తండ్రి బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ్నించి తేవాలి? అని కేసీఆర్ అన్నారు. ఎంఐఎం సభ్యుడు అక్ర్బరుద్దీన్ కోరినట్లు సీఎఎ ప్రత్యేకంగా చర్చ జరుపుదాం అని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణా రాష్ట్ర సీఈఓగా శశాంక్ గోయెల్, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

దేశవ్యాప్తంగా ఐదారు అసెంబ్లీల్లో చర్చ జరిగింది. రాష్ట్రాల అభిప్రాయాన్ని కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్నది తర్వాత చూడాలి. 40-50 మంది చనిపోయిన సీరియస్‌ అంశంపై కచ్చితంగా చర్చ జరగాలి. మన మనోభావాలు కేంద్రానికి తెలియజేయాలి. సభలో ఎవరు ఏం చెప్పినా విందాం..తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపేటప్పుడు చర్చ పెడతామన్నారు. సీఏఏపై రెండు మూడు గంటలైనా సభలో చర్చిద్దాం. సభ అంతిమ ఉద్దేశాన్ని కేంద్రానికి తెలియజేద్దాం. సీఏఏపై సభలో మాట్లాడాలని కేబినెట్‌లో ఇంతకు ముందే తీర్మానం చేసిశామని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు.