Telangana CM KCR meets Maharashtra CM Uddhav Thackeray (ANI)

ముంబై, ఫిబ్రవరి 20: తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో ఆదివారం నాడు ముంబైలో భేటీ అయ్యారు. హైద్రాబాద్ బేగంపేట విమానాశ్రయం నండి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ముంబైలో ఘన స్వాగతం లభించింది. ముంబై ఎయిర్ పోర్టు నుండి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బృందం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి చేరుకొంది. అక్కడే ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. Uddhav Thackerayతో పాటు ఆయన మంత్రివర్గంలో ఇద్దరు కీలక మంత్రులతో పాటు శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ కూడా కేసీఆర్ తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సీఎం కేసిఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీ లు జె.సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి. బి పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు.

ఇదిలా ఏంటూ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేతర పార్టీలతో కేసీఆర్ 2018 నుండి సంప్రదింపులు సాగిస్తున్నారు.అయితే గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఆశించినంతగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు దీంతో మరోసారి కేసీఆర్ బీజేపీయేతర పార్టీలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. గత వారంలో ఉద్దవ్ ఠాక్రే కేసీఆర్ ను ముంబైకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఇవాళ కేసీఆర్ ఉద్దవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. సీఎం కేసీఆర్‌ బృందం థాక్రే అధికారిక నివాసం వర్షాలోనే భోజనాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసానికి వెళ్లనున్నారు. జాతీయ రాజ‌కీయ అంశాల‌పై పవార్‌తోనూ కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు.