CM KCR Yadadri Tour Highlights: యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోంది, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
CM KCR atTRS Plenary Meeting (Photo-Video Grab)

Hyd, Feb 12: యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్‌ శనివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోతుందన్నారు. మిషన్‌ కాకతీయలో చెరువులను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని, . భూముల విలువ విపరీతంగా పెరిగిందన్నారు. తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని, తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిపోయిందని సీఎం (Telangana, CM KCR) అన్నారు

దళితులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి. ఉద్యోగాల విషయంలో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉద్యోగుల జీతాలు ఇంకా పెరుగుతాయి. గతంలో మీకు పరిపాలన చేతకాదని ఎద్దేవా చేశారు. కరెంట్‌ ఉండదు. అంతా చీకటే అన్నారు. ఒక సీఎం అయితే కట్టెతో మ్యాప్‌లో చూపించారు. అప్పుడు అలా చూపించిన వాళ్ల రాష్ట్రంలో కరెంట్‌ లేదు. మన దగ్గర 24 గంటల కరెంట్‌ ఉంది. హైదరాబాద్‌-వరంగల్‌ కారిడార్‌ అద్భుతంగా డెవలప్‌ అవుతోంది. భువనగిరి జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదు. యాదాద్రి పూర్తయితే వేగంగా అభివృద్ధి చెందుతుంది.’ అని పేర్కొన్నారు.

వీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌, విల్లాలను (CM KCR inaugurates Presidential suites) ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను అత్యాధునిక సదుపాయాలతో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఆలయాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేశారు. చిన్న కొండపై 14 విల్లాలు, ఒక మెయిన్‌ సూట్‌ను నిర్మించారు. 13.25 ఎకరాల్లో సూట్ల నిర్మాణం జరిగింది. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో (VVIP cottages at Yadadri) మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు.

ఖబర్ధార్‌ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా, నిన్ను తరిమికొట్టేందుకు తెలంగాణ పులిబిడ్డ‌ వస్తున్నాడు, ఏం చేస్కుంటావో చేసుకో. మీ సంస్కరణలను మేం అమలు చేయమని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్

తెలంగాణ‌లో ద‌ళిత బంధు కార్య‌క్ర‌మం అద్భుత‌మైన‌ద‌ని.. ఆ ప‌థ‌కం కింద ద‌ళితుల‌కు కేవ‌లం రూ.10 ల‌క్ష‌లు ఇవ్వ‌డ‌మే కాదు.. ఇదివ‌ర‌కు ద‌ళితుల‌కు లేని ఎన్నో రిజ‌ర్వేష‌న్లను ఈ స్కీమ్ ద్వారా క‌ల్పిస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇదివ‌ర‌కు ద‌ళితుల‌కు రాని ఎన్నో ఫెసిలిటీల‌ను ఇప్పుడు అందిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌తి రంగంలో ద‌ళితుల‌కు కూడా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డ‌మే ద‌ళిత బంధు ముఖ్య ఉద్దేశం. విదేశీ విద్యలో కూడా పేద విద్యార్థుల‌కు 20 ల‌క్ష‌లు ఇచ్చి వెన్నుత‌ట్టి ప్రోత్స‌హిస్తున్నాం. అద్భుత‌మైన పెట్టుబ‌డులు వస్తున్నాయి. దేశం కిందికి పోతాఉంది. రాష్ట్రం మాత్రం అద్భుతంగా పురోగ‌మిస్తోంది. ఉద్యోగుల‌కు సంబంధించి చిన్నాచిత‌క స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవి కామ‌న్.

69లో జ‌రిగింది ముల్కీ రూల్స్ పోరాట‌మే. కేంద్ర ప్ర‌భుత్వం ఏడిపించినా.. 95 శాతం రిజ‌ర్వేష‌న్లు లోకల్స్ కోసమే కేంద్రం నుంచి కొట్లాడి తీసుకొచ్చా. 95 శాతం ప్ర‌భుత్వ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డ‌ల‌కే. గెజిట‌ల్ పోస్టులు కూడా మ‌ల్టీ జోన‌ల్ పోస్టులుగా తీసుకొచ్చాం. అవి కూడా 95 శాతం తెలంగాణ బిడ్డ‌ల‌కే వ‌స్తాయి. ఇవి తెలియ‌క కొంద‌రు పిచ్చిగా మాట్లాడుతున్నారు. తెలంగాణ‌లో ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం ఉండాలి. ఉద్యోగుల స‌ర్వీస్ రూల్స్ మారాలి. ఉద్యోగ సంఘాల నాయ‌కులను కోరేది కూడా అదే. స‌ర్వీస్ నిబంధ‌న‌లు స‌ర‌ళీక‌రించాలి. రిటైర్ అయ్యేనాటికి స‌ర్వీస్ రూల్స్ సుల‌భంగా ఉండాలి.. అని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

భువనగిరి జిల్లా ఏర్పాటు చేసుకొని, అద్భుతమైన జిల్లా కలెక్టరేట్‌కు ప్రారంభించింకున్నందుకు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్‌ను అభినందిస్తున్నాను. ఎప్పుడు ఎవరూ ఊహించిన మాట కాదు. భువనగిరి జిల్లా అయిదని కలలో ఎవరూ అనుకున్న మాట కాదు. అందరికీ అన్ని విషయాలు అర్థం కావు. ఆ కారణం వల్ల గతంలో యావత్‌ భారత్‌దేశంలో అన్ని రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా.. కేవలం ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయలేదు. గతంలో కొందరు కోరినా చేయలేకపోయారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పారు. కారణం ఏదైనా ఆయన సైతం చేయలేకపోయారు. అనేక రకాల అపోహలు, సరైన పద్ధతిలో కుదరకపోవడంతో సాధ్యం కాలేదు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు సంప్రదించి మొదటి వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌ చీఫ్‌ అడ్వైజర్‌.

తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం చేసిన సందర్భంలో నేను ఆయనను డజన్‌ సార్లు కలవడం జరిగింది. చాలా మందికి అపనమ్మకం, ఆత్మవిశ్వాసం లేకపోవడంతో ఏమో కొట్లాడుతున్నరు గానీ తెలంగాణ అయితదా అని చాలా మంది సంశయజీవులే పెద్ద సంఖ్యలో ఉండిరి. మాకు సంపూర్ణ నమ్మకం ఉండే.. ఈ సారి తెలంగాణ వందకు వందశాతం వస్తదని. ఛత్తీస్‌గఢ్‌ అడ్వైజర్‌ను ఛత్తీస్‌గఢ్‌ మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయిన రాష్ట్రం కదా.. ఏం చేశారని, ఏం స్టెప్స్‌ తీసుకున్నరని అడిగి తెలుసుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్‌ జిల్లా ఉండేదని, దానిపై పెద్ద జోక్స్‌ ఉండేవి. బస్తర్‌ జిల్లా కేరళ రాష్ట్రం కంటే పెద్దగా ఉంటదని జోక్స్‌ ఉండేవి. ఇప్పుడు దాన్ని నాలుగైదు జిల్లాలు చేశారు. అందులో ప్రధాన పాత్ర వహించింది ఛత్తీస్‌గఢ్‌ అడ్వైజర్‌.

వారిని అడిగాం అరౌండ్‌ పది లక్షలు, 10-12 లక్షలు ఉంటే ఈజీ, కొన్ని సందర్భాలు, ప్రత్యేక పరిస్థితుల్లో 5లక్షల పాపులేషన్‌ ఉన్నా ఆయన గోహెడ్‌ అని చెప్పారు. భోనగిరి ర్యాపిడ్‌గా వేగంగా డెవలప్‌ అయ్యే ప్రాంతం. యాదాద్రి టెంపుల్‌ అభివృద్ధి అయిపోతే.. అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది. బీబీనగర్‌, భువనగిరి, ఘట్కేసర్‌, హైదరాబాద్‌ అంతా కలిసిపోయి కారిడర్‌గా ఉంటది. తాను కలగనే కారిడార్‌ వరంగల్‌ – హైదరాబాద్‌ అద్భుతమైన కారిడార్‌ అవుతుంది. వాటి మధ్యలో వచ్చేవన్నీ గ్రోత్‌ సెంటర్స్‌ అవుతాయ్‌. భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్‌, మేడల్చ్‌ జిల్లా కేంద్రాలు కావడం ద్వారా వచ్చేటటువంటి గ్రోత్‌.. అందరు సామాన్యులకు అర్థం కాదు.

భువనగిరి, యాదాద్రిలో భూముల ధరలు ఎట్ల ఉన్నయ్‌.. ఒకప్పుడు ఎట్ల ఉండే. గుట్టపొంటి సైతం కోట్లే. మారుమూల గ్రామాలకు పోతే 25-30లక్షల్లోపు ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాగనూర్‌ మండల కేంద్రంలో అక్కడ భూమి ఎవరు అడగపోతేది. అక్కడ సైతం రూ.25లక్షల ఎకరంకు తక్కువ లేదు. తెలంగాణ శివారులోని కర్ణాటకలో రూ.4లక్షలు, రూ.5లక్షలు ఉంటే.. మన ప్రాంతంలో రూ.25లక్షలకు తక్కువ లేదని ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి చెప్పిండు. మారు మూల ప్రాంతాల్లోని ఆదిలాబాద్‌ అడవి జిల్లా, అచ్చంపేట, నారాయణపేట జిల్లాలో భూముల ధరలు పెరిగాయన్నారు.

కలక్టరేట్ బిల్డింగ్ ప్రారంభం తర్వాత.. ఇవాళ అద్భుత‌మైన భ‌వ‌నంలో నిల‌బ‌డి మాట్లాడుతున్నాం. ఉషారెడ్డి అనే తెలంగాణ బిడ్డ ఈ భ‌వ‌నానికి ఆర్కిటెక్ట్. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా బిడ్డే. త‌నే 33 జిల్లాల్లో క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాల‌కు ఆర్కిటెక్చ‌ర్‌గా ఉంది. బ్ర‌హ్మాండంగా త‌నే ఈ బిల్డింగ్‌ల‌ను నిర్మిస్తోంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల కృషి కూడా తెలంగాణ అభివృద్ధిలో ఉంది. అందుకే మీకు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను. తెలంగాణ‌లో ఉండే గ్రామాలు ఇప్పుడు ఎంత‌గా అభివృద్ధి చెందాయి. మ‌నిషి చ‌నిపోతే అంత్య‌క్రియ‌లు చేయ‌డానికి ఇదివ‌ర‌కు జాగ లేకుండే. ఇప్పుడు ప్ర‌తి గ్రామంలో ఒక వైకుంఠ‌దామం ఉంది. ప్ర‌తి గ్రామంలో ఒక ట్రాక్ట‌ర్, ఒక డంప్ యార్డ్. ప్ర‌తి ఇంటికి న‌ల్లా క‌నెక్ష‌న్.. ఇలా అన్ని ర‌కాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఇంకొద్దిగా కృషిని కొనసాగిద్దాం.. అని సీఎం స్ప‌ష్టం చేశారు.

రాయ‌గిరి నుంచి భువ‌న‌గిరి రోడ్డు ఎలా ఉంది.. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌కు పోయే రోడ్డులా ఉంది.. ఆ రోడ్డు ఇంత‌కుముందు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉంది. రేపు రాష్ట్రం కూడా అంతే. మీరు అధికారులుగా, ప్ర‌జాప్ర‌తినిధులుగా స‌మ‌న్వ‌యం చేసుకుంటూ చేస్తున్న ప‌నిని అలాగే కొన‌సాగించండని సీఎం అన్నారు.