CM Revanth Reddy On MSME Policy: ఎంఎస్‌ఎంఈలు బలపడితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రాష్ట్ర సంపద పెంపొందించాలనే ఈ కొత్త పాలసీని రూపొందించామన్న సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర సంపదను పెంపొందించాలనే MSME పాలసీ-2024 ను ఆవిష్కరించాం అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. MSME పాలసీ - 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్...సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయం అన్నారు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదు...అందుకే MSME పాలసీ-2024 ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
Hyd, Sep 18: రాష్ట్ర సంపదను పెంపొందించాలనే MSME పాలసీ-2024 ను ఆవిష్కరించాం అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. MSME పాలసీ - 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్...సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయం అన్నారు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదు...అందుకే MSME పాలసీ-2024 ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే...కొత్త పాలసీని ముందుకు తీసుకెళతాం అన్నారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ....అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవు...కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించిందన్నారు.మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగించడానికి మాకు అభ్యంతరం లేదు.
రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలను తొలగించేందుకు మా ప్రభుత్వం వెనక్కు తగ్గదు..ప్రస్తుతం చదివిన చదువుకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య అంతరం ఏర్పడిందన్నారు. అందుకే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం..టాటా ఇనిస్టిట్యూట్ తో కలిసి సంయుక్తంగా రూ. 2400 కోట్లతో ఆధునీకరిస్తున్నాం అని తెలిపారు. పూర్తి అధ్యయనం తరువాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం..ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం అందించేలా యువతకు ఇందులో శిక్షణ ఇస్తాం అన్నారు.
యూనివర్సిటీ నిర్వహణకు పారిశ్రామిక వేత్తలు నుంచి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నాం..వీటిని యూనివర్సిటీ నిర్వహణకు ఖర్చు చేసేలా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసిందన్నారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి వ్యవసాయం పండగ అని నిరూపించాం...అయినా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం రైతు కుటుంబానికి సరిపోవడం లేదు అన్నారు. ఎంఎస్‌ఎమ్‌ఈ పాలసీని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు..వీడియో ఇదిగో
తెలంగాణ రైతాంగానికి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్న..వ్యవసాయాన్ని వదలొద్దు...అగ్రికల్చర్ అనేది మన కల్చర్ అన్నారు. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం...ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు.మూసీ అంటే మురికి కోపం కాదు... మూసీని మ్యాన్ మేడ్ వండర్ గా తీర్చిదిద్దబోతున్నాం...మా ప్రభుత్వం గత ప్రభుత్వంలా గడీల మధ్య లేదు అన్నారు.ఇది ప్రజల కోసమే పని చేసే ప్రజా ప్రభుత్వం...మా ప్రభుత్వంలో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని..మా ప్రభుత్వం స్వయంసహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. శిల్పారామంలో 3ఎకరాల స్థలంలో స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సదుపాయం కల్పిస్తున్నాం..అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో నిర్వహణ మహిళల చేతుల్లోపెట్టాం అన్నారు.
మహిళా సంఘాలకే స్కూల్ యూనిఫామ్ కుట్టు పని బాధ్యతలు ఇచ్చాం...యూనిఫామ్ ధరను రూ.25 నుంచి రూ.75 చేసి ఆడబిడ్డలను ఆర్ధికంగా ఆదుకుంటున్నాం అన్నారు. MSME లు బలపడితేనే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి..MSMEలకు మా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.
(The above story first appeared on LatestLY on Sep 18, 2024 04:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

