Rape Representative image.

HYd, August 5: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన (Telangana Shocker) చోటు చేసుకుంది. ఓ కామాంధుడు మహిళా సర్పంచ్‌పై అత్యాచారానికి (Rape attempt forces female sarpanch ) పాల్పడ్డాడు.ఈ షాకింగ్ ఘటనతో తన పరువు పోయిందని తీవ్ర అవమానంగా భావించిన బాధితురాలు ఆత్మహత్యకు (end life in Kothagudem) పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని కోమటిపల్లి గ్రామ సర్పంచ్‌ భూక్యా కుమారి(30)పై ఇటీవల నవీన్ అనే అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి మరో వ్యక్తి సహకరించాడు.

అత్యాచార ఘటనపై కుమారి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అత్యాచార ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమారి పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు మొదట ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అదృశ్య శక్తి ఆవహించిందంటూ ఏడేళ్ల చిన్నారి తలను నరికేసిన మైనర్ బాలిక, తల్లిదండ్రులపై కూడా కత్తితో దాడి, నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో భూక్యా కుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కుమారి ఆత్మహత్యకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోమటిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.