Hyderabad, July 31: తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు (Rain Alert) కురుస్తాయని వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను (Yellow Alert) జారీ చేసింది. రాగల మూడురోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని చెప్పింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో గాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ఆగస్టు 3న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.