Road accident (image use for representational)
Hyd, March 19: శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూ ట్యూబర్, సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్, నటి డాలీ అలియాస్ గాయత్రి మృతి చెందింది. ఈ విషయాన్ని టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖావాణి వెల్లడించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డాలీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఇలా రాశారు. "డాలీ ఇది చాలా అన్యాయం. ఇది నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నీతో నాకు అద్భుతమైన జ్ఞాపకాలున్నాయి. అసలు మాటలు రావట్లేదు. టోటల్లీ బ్లాంక్" అని పోస్ట్ చేశారు. గచ్చిబౌలి రోడ్డుప్రమాదంలో నటి డాలీ చనిపోయిందని తెలిసిన వారు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.
డాలీ అసలు పేరు గాయత్రి. తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న డాలీ నిన్న రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ప్రమాద సమయంలో కారులో రోహిత్ అనే యువకుడితో పాటు మరో యువతి, డాలీ ఉన్నట్లు సమాచారం. మద్యంసేవించి కారు నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.