Heavy rain in many parts of Hyderabad, Yellow alert issued ,IMD says 5 days rains in Telangana

Hyderabad, Aug 25: తెలంగాణలోని (Telangana) పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు (Heavy Rains in Telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలెవ్వరూ  బయట తిరగకూడదని అధికారులు హెచ్చరించారు. వర్షం పడేటప్పుడు ఇంట్లోనే ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.

N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున, కోర్టు ఆదేశాలకు విరుద్దంగా కూల్చివేత,ఒక్క అంగుళం కూడా ఆగ్రమించలేదు

మిగతా జిల్లాల్లో కూడా

పైన పేర్కొన్న జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా.. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్.. కేంద్రం నుంచి కొత్త పెన్షన్ విధానం.. 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి