Credits: Twitter

సూర్యాపేట జిల్లాలోని ఎర్రవరం లో వెలసిన బాల నరసింహ స్వామి మహిమలు రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి.  తెలంగాణలో మరో యాదాద్రిగా మారుతున్నటువంటి బాల నరసింహ స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. . స్వామి లీలలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.  తాజాగా బాల నరసింహ స్వామికి సంబంధించి కొన్ని సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి బాల నరసింహ స్వామి కొలువై ఉన్నటువంటి శిలా పైన ఒకప్పుడు ఒక పెద్ద నాగు పాము పుట్ట ఉండేదని ఆ పుట్టలోనే నాగుపాము పడగ  కింద బాల నరసింహ స్వామి కొలువై ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.

వైకుంఠంలో ఆదిశేషు పడగనిడలోనే శ్రీమహావిష్ణువు నిద్రిస్తాడు.  ఆ శ్రీమహావిష్ణువు మరో అవతారం అయినటువంటి నరసింహస్వామికి సైతం కలియుగంలో సాక్షాత్తు ఆదిశేషు  అవతారం పడగ  ఇవ్వడం  ఆశ్చర్యకరమని పండితులు చెబుతున్నారు. బాల నరసింహ స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ మహత్యాన్ని గుర్తించి ఆదిశేషువును ప్రసన్నం చేసుకునేందుకు పాలతో ఉడికించిన అన్నం అంటే పాయసం  నైవేద్యంగా స్వామి వారికి  సమర్పించడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు. ఎర్రవరం బాల నరసింహ స్వామి క్షేత్రంలో మహిమలు  చూసిన ప్రజలు ఇప్పటికే తండోపతండాలుగా తరలివస్తున్నారు.  మీరు కూడా ఎర్రవరం వెళ్లాలి అనుకుంటే కోదాడకు వెళ్లి అక్కడ బస్టాండ్ లో ఎర్రవరం వెళ్లే ఆర్టీసీ సర్వీసు ద్వారా మీరు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవచ్చు.