New York, March 15: ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ తో టెక్ కంపెనీలకు (Tech compenies) కష్టాలు మొదలయ్యాయి.ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సంస్థలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అదేబాటలో పయనిస్తోంది ఆపిల్ కంపెనీ (Apple INC). ప్రతి సంవత్సరం ఉద్యోగులకు ఇచ్చే బోనస్‌ ను నిలిపివేసింది (delaying employee bonuses). ఏటా రెండుసార్లు ఉద్యోగులకు బోనస్, ప్రమోషన్లను ప్రకటిస్తుంది ఆపిల్ కంపెనీ. ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఎంప్లాయిస్ పర్ఫామెన్స్ ఆధారంగా బోనస్ ఇస్తుంది. కానీ ఆర్ధిక మాంద్యం కారణంగా ఉద్యోగులకు మొండిచేయి ఇచ్చింది. అంతేకాదు కొత్త ఉద్యోగుల నియామకాల విషయంలో కూడా ఆపిల్ కంపెనీ ఆచితూచి వ్యవహరిస్తోంది.ఉద్యోగం మానేసి వెళ్లిపోయినవారి స్థానంలో కొత్తవాళ్లను తీసుకోవడం లేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)