New Delhi, FEB04: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ (Twitter) ట్విట్టర్ పేమెంట్ వెరిఫికేషన్ మార్క్ కోసం యూజర్లకు ఛార్జీలు విధిస్తోంది. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ట్విట్టర్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అందులో ట్విట్టర్ బ్లూ వెరిఫికేషన్ టిక్ కూడా ఛార్జీ విధించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) కూడా అదే దారిలో వెళ్లనుంది. ట్విట్టర్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ కూడా బ్లూ బ్యాడ్జ్ (Instagram Blue Badge) ఛార్జీలను విధించాలని భావిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ త్వరలో పేమెంట్ వెరిఫికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతుందని నివేదిక వెల్లడించింది. దీనికి సంబంధించి IG_NME_PAID_BLUE_BADGE_IDV, FB_NME_PAID_BLUE_BADGE_IDV వంటి స్ర్కీన్‌షాట్‌లను TechCrunch ద్వారా షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్ (Facebook) రెండింటిలోనూ పేమెంట్ వెరిఫికేషన్ ఫీచర్ టెస్టింగ్ చేస్తోందని పేర్కొంది. IDV అంటే ‘ఐడెంటిఫికేషణ్ వెరిఫికేషన్’ అని నివేదిక చెబుతోంది.
Twitter ప్రస్తుతం వెరిఫికేషన్ బ్యాడ్జ్, ఇతర బెనిఫిట్స్ కలిగి ఉన్న బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం వెబ్ యూజర్లకు నెలకు 8 డాలర్లు ఛార్జ్ చేస్తోంది. iOS లేదా Android యూజర్లు నెలకు 11 డాలర్లు చెల్లించాలి. ప్రస్తుతం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, యూకే, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి, మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ భారత మార్కెట్లో అదే ఫీచర్‌ను ఇంకా లాంచ్ చేయలేదు. అయినప్పటికీ, ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. iOS యూజర్లు దేశంలో రూ.999 చెల్లించాల్సి రావచ్చు. గత ఏడాది నవంబర్‌లో, బ్లూ సబ్‌స్క్రిప్షన్ భారత మార్కెట్లో కూడా అందుబాటులోకి రావొచ్చునని ఎలోన్ మస్క్ ధృవీకరించారు. ఇన్‌స్టాగ్రామ్ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌కి కూడా ఛార్జీ విధిస్తే.. ప్లాట్‌ఫారమ్‌లోని ఎవరైనా ట్విట్టర్ మాదిరిగానే చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్ (Facebook)లలో వెరిఫై చేసిన తర్వాత బ్యాడ్జ్‌లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతానికి, ఈ ఫీచర్‌పై క్లారిటీ లేదు. అంతేకాకుండా, ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల క్యాండిడ్ స్టోరీస్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. యూజర్లు తమ స్టోరీలో ఏదైనా ఫొటోను క్యాప్చర్ చేయడానికి లేదా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. సొంత క్యాండిడ్ స్టోరీలను షేర్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ BeReal యాప్‌లో ఉన్న కాన్సెప్ట్‌కి కాపీ అయినట్లు చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిల్టర్‌లతో పిక్చర్-పర్ఫెక్ట్ ఫొటోలు లేదా చిన్న వీడియోలను షేర్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్లాట్‌ఫారమ్ మరింత వాస్తవికంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. BeReal యాప్-ప్రేరేపిత ఫీచర్‌ను యాడ్ చేస్తోంది. ఫేస్‌బుక్ స్టోరీస్‌లో కూడా ఇలాంటి ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు కంపెనీ ధృవీకరించింది.