Layoffs | Representational Image (Photo Credits: Pexels)

Kansas, SEP 21: ప్రముఖ ఆటో దిగ్గజ సంస్థ జనరల్ మోటార్స్‌లో (General Motors Layoffs) భారీగా ఉద్యోగులను తొలగించారు. ఒకవైపు ఆర్ధికమాంధ్యంతో ప్రముఖ టెక్‌ కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్న సమయంలో జనరల్ మోటార్స్ తీసుకున్న నిర్ణయం సంచనలంగా మారింది. అయితే జనరల్ మోటార్స్ (General Motors Layoffs) తీసుకున్న నిర్ణయంపై ఆర్ధిక మాంధ్యం ఎఫెక్ట్ లేదు. కన్సాన్ ఫ్యాక్టరీలోని (Kansas Factory) ఆటోమేకర్స్ తమకు మెరుగైన వేతనంతో పాటూ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ కొంతకాలంగా స్ట్రైక్‌ చేస్తున్నారు. దీంతో జనరల్ మోటార్స్ సంస్థ వారిపై వేటు వేసింది. దాదాపు రెండు వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

 

గతవారమే తమ ఎంప్లాయిస్‌కు జనరల్ మోటార్స్ హెచ్చరికలు జారీ చేసింది. నిరసన విరమించి పనిలో చేరాలని కోరింది. కానీ వారంతా వినకపోవడంతో వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే జనరల్ మోటార్స్ సంస్థ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఎంప్లాయిస్‌ను తొలగించడం (Job Cuts) ఇదే తొలిసారి.