OnePlus Nord CE 4 5G | Photo- OnePlus India Official

OnePlus Nord CE 4 5G: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ తాజాగా 'వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 5G' పేరుతో మరొక మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది Nord సిరీస్ లైనప్‌లో వచ్చిన ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌. ఈ సెగ్మెంట్లో మిగతా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లతో పోలిస్తే OnePlus Nord CE 4 5Gలో మెరుగైన కెమెరా, అద్భుతమైన పనితీరు కలిగి ఉండే సాఫ్ట్‌వేర్ మరియు వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ లను కలిగి ఉంది. ఆప్టిక్స్ పరంగా, Nord CE 4 5Gలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్ ఉంది, అలాగే 8MP సోనీ IMX355 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 50MP సోనీ LYT600 ప్రైమరీ సెన్సార్‌ కలిగిన డ్యూయల్  కెమెరా సెటప్ ఉంది. దీని వెనుక కెమెరా ద్వారా 30fps వద్ద 4K వీడియోని షూట్ చేయవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,500mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని పొందుపరిచారు, దీనిని 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 29 నిమిషాలలోనే 0-100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. OnePlus Nord CE 4 5G 8GB+128GB మరియు 8GB+256GB రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఫోన్ సెలాడాన్ మార్బుల్ మరియు డార్క్ క్రోమ్ కలర్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. సరికొత్త OnePlus Nord CE 4 5G స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏ విధంగా ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద పరిశీలించండి.

OnePlus Nord CE 4 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7-అంగుళాల  AMOLED డిస్‌ప్లే
  • 8GB RAM, 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+8MP డ్యూయల్  కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్
  • 5500 mAh బ్యాటరీ సామర్థ్యం, 100W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్‌

ధరలు: 8GB RAM + 128GB వేరియంట్ కోసం రూ. 24,999/-

8GB RAM + 256GB వెర్షన్ కోసం రూ. 26,999/-

ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 4 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. . ప్రారంభోత్సవ ఆఫర్‌గా, ఈ ఫోన్ కొనుగోలుదారులకు రూ. 2500 విలువైన OnePlus Nord Buds 2rని ఉచితంగా అందిస్తున్నారు. వివిధ బ్యాంక్ కార్డు హోల్డర్లకు రూ. 1500 వరకు తక్షణ డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి.