Newdelhi, Nov 21: భూమిపై (Earth) సూర్యోదయం (Sun Rise), సూర్యాస్తమయాలు (Sun Set) తెలిసిందే. భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నట్టే.... భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తుంటాడు. భూమికి చంద్రుడు (Moon) ఉపగ్రహం. మనకు సూర్యోదయం అయినట్టే, చంద్రుడిపై భూమి ఉదయిస్తుంది. దీనికి సంబంధించిన అద్భుత దృశ్యాలను జపాన్ (Japan) కు చెందిన లూనార్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ కగుయా చిత్రీకరించింది.
చంద్రుడి ఉపరితలం మీదుగా పుడమి ఉదయిస్తుండడాన్ని కగుయాలోని అత్యాధునిక కెమెరాలు బంధించాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది.
Earth rising over the Moon captured by the Japanese lunar orbiter spacecraft Kaguya pic.twitter.com/ADKAwNZkWf
— Vala Afshar (@ValaAfshar) November 19, 2022