పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని ఖార్, బజౌర్‌లో కార్మికుల సదస్సులో జరిగిన పేలుడులో జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUI-F) స్థానిక నాయకుడు సహా కనీసం 35 మంది మరణించారు. పాకిస్థాన్ చట్ట అమలు సంస్థ ప్రకారం, పేలుడు సంభవించినప్పుడు JUI-F నాయకుడు ప్రసంగిస్తున్నారు. పాకిస్తాన్ మీడియా జియో న్యూస్ ప్రకారం, జిల్లా అత్యవసర అధికారి మాట్లాడుతూ, క్షతగాత్రులను పెషావర్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. గాయపడినవారిలో జియో న్యూస్ కెమెరామెన్ సమీవుల్లా కూడా ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో లోయర్ దిర్‌లోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్పించారు.
సాయంత్రం 4 గంటలకు పేలుడు
JUI-F ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రతినిధి అబ్దుల్ జలీల్ ఖాన్ జియో న్యూస్‌తో మాట్లాడుతూ, మౌలానా లాయెక్ సదస్సులో ప్రసంగిస్తున్నప్పుడు సాయంత్రం 4 గంటలకు పేలుడు సంభవించింది. కాన్ఫరెన్స్‌లో JUI-F MNA మౌలానా జమాలుద్దీన్, సెనేటర్ అబ్దుల్ రషీద్ కూడా హాజరయ్యారని ప్రావిన్షియల్ అధికార ప్రతినిధి తెలిపారు. మృతుల్లో JUI-F తహసీల్ ఖార్ ఎమిర్ మౌలానా జియావుల్లా కూడా ఉన్నారని ఆయన ధృవీకరించారు.
Pak bomb blast: Death toll rises to 20, local JUI-F leader also killed
Read @ANI Story | https://t.co/O5loUbIvjJ#Pakistan #BombBlast #khyberpaktunkawa pic.twitter.com/HOAoSObTAA
— ANI Digital (@ani_digital) July 30, 2023
బాంబు పేలుళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్
JUI-F చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఈ సంఘటనపై ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరియు KP యొక్క తాత్కాలిక ముఖ్యమంత్రి ఆజం ఖాన్ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేలుడును ఖండిస్తూ, క్షతగాత్రుల ఆరోగ్యాన్ని కాపాడాలని, మృతులను ఆదుకోవాలని ఫజల్ విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు.