అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో కొత్త రకం వ్యాధిని శాస్త్రవేత్తలు, వైద్యులు కనుగొన్నారు. ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు(Bubonic Plague) సోకినట్లు గుర్తించారు.పెంపుడు పిల్లి ద్వారా సంక్రమించే బుబోనిక్ ప్లేగు (First Human Case of Bubonic Plague in Oregon) బయటకు రావడంతో యుఎస్ లో కలవరం మొదలైంది. బుబోనిక్ ప్లేగు వల్ల ఒకప్పుడు యూరోప్‌లో భారీ నష్టం జరిగింది. మధ్యయుగంలో యూరోప్‌లో సోకిన ఆ ప్లేగు (US Resident Diagnosed With Rare Plague) వల్ల సుమారు మూడవ వంత జనాభా మృతిచెందింది. దీన్నే బ్లాక్ డెత్‌గా వర్ణిస్తున్నారు.
ఓరేగాన్‌లోని డిసెచూట్స్ కౌంటీలో తాజా కేసును గుర్తించారు. అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నామని అధికారులు చెప్పారు. బాధితుడి సమీపంలో ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తికి చెందిన పెంపుడు పిల్లికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు డాక్టర్ రిచర్డ్ వాసెట్ తెలిపారు.ఈ వ్యాధికి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇది ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
డెస్చుట్స్ కౌంటీకి చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. పెంపుడు జంతువులతో బాధితునికి ఉన్న అనుబంధాన్ని వైద్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చికిత్స ప్రారంభిస్తూ అవసరమైన మందులు అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. జ్వరం, వికారం, నీరసం, చలి, కండరాల నొప్పులు, వొళ్లు నొప్పులు, ఈ వ్యాధి లక్షణాలు. ప్లేగు సోకిన వారం రోజుల తర్వాత నుంచి ఈ లక్షణాలు కనిపిస్తాయి.
దీనిని ముందుగా గుర్తించకపోతే రక్తప్రవాహాన్ని అడ్డగించి ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఫలితంగా న్యుమోనిక్ ప్లేగుకు దారితీస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అయితే.. అదృష్టవశాత్తూ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి అవసరమైన చికిత్స అందించడం విశేషం. దీంతో ప్రమాదాన్ని కొంత మేరకు అయినా నివారించవచ్చు.
ప్రమాదకరంగా మారుతున్న ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా, దాదాపు 14,000 పక్షులను చంపేసిన జపాన్
జంతువు నుంచి ప్లేగు వైరస్ సోకిన 8 రోజుల తర్వాత మనిషిలో ఆ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని అధికారులు చెప్పారు.ప్రాథమిక దశలో బుబోనిక్ ప్లేగును గుర్తించి చికిత్స అందించాలి. లేదంటే అది సెప్టిసెమిక్ ప్లేగ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. 14వ శతాబ్ధంలో యూరోప్‌లో వచ్చిన ఆ వ్యాధి వల్ల 5 కోట్ల మంది బలయ్యారు. అయితే ఓరేగావ్ లో నమోదు అయిన కేసు అత్యంత అరుదైనదన్నారు. ఆ రాష్ట్రంలో చివరిసారి 2015లో ఆ కేసు నమోదు అయ్యింది.