ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా లక్షద్వీప్ ను పర్యాటకధామంగా మారుద్దామని ఆయన సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మగా ఒక మంత్రి వ్యాఖ్యానించగా, మరో ఇద్దరు భారత్ ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో ఆ ముగ్గురు మంత్రులను అక్కడి ప్రభుత్వం పదవుల నుంచి (Maldives Government Suspends Ministers) తప్పించింది.
Here's News
#Breaking | #Maldives government suspends 3 ministers - Mariyam Shiuna, Malsha Shareef and Mahzoom Majid - over derogatory remarks made on PM #NarendraModi, Indiahttps://t.co/RqsbYe1nyp pic.twitter.com/bwX2cLeT5G
— Hindustan Times (@htTweets) January 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)