అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఫాక్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్‌పై నోరు పారేసుకున్నారు. వైట్‌హౌజ్‌లో జరిగిన ఓ మీటింగ్‌లో రిపోర్టర్ పీటర్ డూసీ ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశారు.మధ్యంతర ఎన్నికల వేళ.. ద్రవ్యోల్బణం రాజకీయ బాధ్యతగా భావిస్తారా అని వైట్‌హౌజ్ కరస్పాండెంట్ అడిగారు. దానికి సమాధానం ఇస్తూ బైడెన్ అసహనానికి లోనయ్యారు. ద్రవ్యోల్బణం ఓ గొప్ప సంపద అంటూనే.. ప్రశ్న వేసిన జర్నలిస్టును తిట్టేశారు.

వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ.. అంటూ నోరు జారారు. అయితే ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉంది. కానీ అక్కడ నుంచి అందరూ వెళ్లిపోతున్న నేపథ్యంలో.. ఆ మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. రిపోర్టర్ పీటర్ డూసీపై బైడెన్ నోరు జారినట్లు తెలుసుకున్న తర్వాత అందరూ షాకయ్యారు. ఆ ఘటన జరిగిన గంట తర్వాత బైడెన్ ఆ రిపోర్టర్‌కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. పర్సనల్‌గా తీసుకోవద్దు అంటూ బైడెన్ కోరారని పీటర్ తెలిపాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)