2024 Bajaj Pulsar NS200 & NS160 (PIC@ X)

Mumbai, FEB 17:  బజాజ్ ఆటో (Bajaj Auto) భారత్ మార్కెట్లోకి అప్‌డేటెడ్ 2024 పల్సర్ ఎన్ఎస్ 200 (Pulsar NS200), పల్సర్ ఎన్ఎస్ 160 (Pulsar NS160) మోడల్ మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ మోటారు సైకిళ్లతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ ధర పలుకుతాయి. కొన్నేండ్లుగా దేశీయ మార్కెట్లో రెండు ఎన్ఎస్ పల్సర్ మోటారు సైకిళ్ల విక్రయాలు గణనీయ స్థాయిలోనే జరుగుతున్నాయి. ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌తోపాటు 2024 వర్షన్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200, 2024 వర్షన్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 బైక్‌లు వస్తున్నాయి. ప్రారంభం నుంచి పల్సర్ ఎన్ఎస్200, పల్సర్ ఎన్ఎస్160 బైక్‌లు హలోజన్ హెడ్ ల్యాంప్ కలిగి ఉన్నాయి. వీటి ధరలు ఎంత అన్నది వెల్లడించలేదు.

 

బజాజ్ పల్సర్ ఎన్160, బజాజ్ పల్సర్ ఎన్150 మోటారు సైకిళ్లలో తొలిసారి వినియోగించిన న్యూ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వినియోగిస్తున్నారు. లెఫ్ట్‌స్విచ్ గేర్ మీద బటన్ ద్వారా నియంత్రించే బ్లాక్డ్ ఔట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో న్యూ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్, మొబైల్ నోటిఫికేషన్ అలర్ట్స్, తక్షణ ఫ్యుయల్ ఎకానమీ, డిస్టెన్స్ టూ ఏంప్టీ, ఏవరేజ్ ఫ్యుయల్ ఎకానమీ, టైం తదితర అలర్ట్‌లు వస్తాయి. వీటితోపాటు ట్రిప్ మీటర్, ఓడో మీటర్, స్పీడో మీటర్, ఫ్యుయల్ గాజ్ కూడా ఉంటాయి.

Honda BR-V N7X Edition: మారుతి ఎర్టిగా, కియా కారెన్స్ వంటి కార్లకు పోటీగా హోండా నుంచి సరికొత్త SUV, సరికొత్త BR-V N7X ఎడిషన్ కారును ప్రవేశపెట్టిన కార్ మేకర్, దీని ధర ఎంతో తెలుసా?! 

అనలాగ్ టాచో మీటర్ స్థానంలో న్యూ డిజిటల్ యూనిట్ ఏర్పాటు చేశారు. మోటారు సైకిల్ మీద రైడింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్స్ అటెండ్ చేయవచ్చు.. రిజెక్ట్ చేయవచ్చు. మొబైల్ ఫోన్‌తో మోటారు సైకిల్ కనెక్ట్ చేయడానికి బజాజ్ రైడ్ కనెక్ట్ అప్లికేషన్ ఉంటుంది. మొబైల్ ఫోన్ల చార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్ కూడా జత చేస్తున్నారు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మోటారు సైకిల్ 9750 ఆర్పీఎం వద్ద 24.16 బీహెచ్పీ విద్యుత్, 8000 ఆర్పీఎం వద్ద 18.74 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. మరోవైపు, పల్సర్ ఎన్ఎస్ 160 బైక్ 9000 ఆర్పీఎం వద్ద 16.96 బీహెచ్పీ విద్యుత్, 7250 ఆర్పీఎం వద్ద 14.6 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.