ప్రముఖ మోటార్ సైకిల్ ఉత్పత్తుల సంస్థ బజాజ్ (Bajaj auto) నుంచి మరో సరికొత్త బైక్ బజాజ్ సిటీ110 (Bajaj CT110) భారత మార్కెట్లో విడుదలైంది. ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. కిక్ స్టార్ట్ వేరియంట్ ధర ఢిల్లీ ఎక్స్ షోరూంలో రూ.37,997/- ఉండగా ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధరను రూ. 44,480/- గా నిర్ణయించారు. ఈ బైక్ బజాజ్ నుంచి గతంలో విడుదలైన 'సిటీ100' మోడెల్ కు ఎగువగా మోడెల్ గా అలాగే 'ప్లాటిన 100' కొద్దిగా దిగువగా చెప్పవచ్చు.
బజాజ్ సిటీ110 బైక్ మూడు ఆకర్శణీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. ఆకుపచ్చ- పసుపు కాంబినేషన్, బ్లాక్ మరియు బ్లూ కాంబినేషన్ మరియు రెడ్ కలర్ షేడ్లలో ఇచ్చారు.
బజాజ్ నుంచి విడుదలైన 'CT' మోడెల్ బైక్ లకు భారత మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. అవి అందుబాటు ధరలలో లభిస్తూ, మంచి మైలేజ్ మరియు ఎక్కువ కాలం ఎలాంటి రిపేర్స్ రాకుండా మన్నికగా ఉండటంతో సిటీలోని జనాలు ఎక్కువగా ఇలాంటి బైక్స్ ను కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు 'CT' మోడెల్ శ్రేణిలోనే మరిన్ని అదనపు ప్రయోజనాలు కలుగజేస్తూ బజాజ్ సిటీ110 విడుదల చేశారు. ముఖ్యంగా నగర- గ్రామీణ ప్రాంతాల మిడిల్ క్లాస్ జనాలను లక్ష్యంగా చేసుకుని ఈ బైక్ విడుదల చేశారు. వినియోగదారులను ఆకర్శించేందుకు మంచి ధర, మంచి ఫీచర్స్ ఇందులో పొందుపరిచారు. బజాస్ సిటీ110 పూర్తిగా సరికొత్త లుక్ తో ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్, మంచి గ్రిప్ ఉన్న టైర్లు నగర, గ్రామీణ రోడ్లపై కూడా సురక్షితంగా ప్రయాణించేలా ఉన్నాయి. అలాగే పొడవైన సీటు, బైక్ నడిపేవారికి సౌకర్యవంతంగా ఉండేందుకు ఫ్యుఎల్ ట్యాంకుకు రెండు వైపులా రబ్బర్ ప్యాడ్స్ ఇచ్చారు.
మొత్తంగా చూస్తే బజాజ్ సిటీ110 మార్కెట్లోని ఇతర టూవీలర్ మోడెల్స్ అయిన టీవీఎస్ స్పోర్ట్ మరియు హీరో డీలక్స్ లకు మంచి పోటీ ఇస్తుంది.
ఇక Bajaj Bajaj CT110 ఇతర విశిష్టతలు ఇలా ఉన్నాయి...
ఇంజిన్ సామర్థ్యం 115 సిసి
సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ డీటీఎస్-ఐ ఇంజిన్
8.6 bhp పవర్ మరియు 9.81 Nm టార్క్
130 mm డ్రమ్ బ్రేక్స్ (ముందు, వెనక)
ఎలక్ట్రిక్ స్టార్ట్ (ఆప్షనల్)