ప్రముఖ బ్రిటన్ కార్ల తయారీ సంస్థ (British Morris Garages) ఎప్పట్నించో ఊరిస్తూ వస్తున్న ఎం.జీ హెక్టార్ ( M.G HECTOR) ఎస్‌యూవీ కారును ఇప్పుడు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇది ఒక స్మార్ట్‌కార్, మిగతా కార్లలో లేని ఎన్నో ప్రత్యేకతలు ఈ కారులో ఉన్నాయి. వాయిస్ అసిస్ట్, జియో ఫెన్సింగ్, రియల్ టైం నేవిగేషన్, రిమోట్ లొకేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఆటొమెటిక్ క్లైమేట్ కంట్రోల్ తదితర ఫీచర్లు దీని ఇస్మార్ట్ వ్యవస్థలో భాగం. ఈ కారును ఎక్కడ పార్క్ చేసినా, లేదా కారు ఎటువైపు వెళ్తుందో సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ కారును మన స్మార్ట్‌ఫోన్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్స్ మాత్రమే కాదు ఈమెయిల్స్, ఆఫీస్ కి సంబంధించిన ఇతర పనులు చేసుకోవటానికి వీలుగా ఇందులో ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఇండియాలో ఇంతవరకూ ఎలాంటి కారులో లేని విధంగా 10.4 ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ను పొందుపరిచారు.  360 డిగ్రీస్ లో చూపించే కెమెరా ఉంది. ఈ కారు 5 రంగుల్లో లభ్యమవుతుంది.  సీటింగ్ కెపాసిటీ 5, రిక్లైనింగ్ తో వచ్చింది, లగేజ్‌కి స్పేస్ అవసరమనుకుంటే వెనక సీట్లు ఫ్లాట్ గా మడత పెట్టేసుకోవచ్చు. 5 సంవత్సరాలు లేదా లక్షా 50 వేల కి. మీ వరకు వారంటీతో అందిస్తున్నారు.

టాటా హారియర్ (Tata Harrier), మహీంద్రా ఎక్స్‌యూవీ500, (Mahindra XUV500), జీప్ కంపాస్ (Jeep Compass) and హ్యుందాయ్ టక్‌సన్ (Hyundai Tucson) లాంటి ఎస్ యూవీ కార్లకు ఇది గట్టి పోటీ.

ఢిల్లీ ఎక్స్ షోరూంలో దీని ధర 12.18 నుంచి 16.88 లక్షలుగా ఉంది.

ఫీచర్లు

ఇంజిన్ సామర్థ్యం - 1956 CC

పవర్ - 168bhp@3750rpm

టార్క్ - 350Nm@1750-2500rpm

మైలేజ్ - లీటరుకు 17.41 కి.మీ

ఫ్యుయెల్ ట్యాంక్ - పెట్రోల్/ డీజిల్

గేర్లు - 6

సిలిండర్ల సంఖ్య - 8

ఫ్యుఎల్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు