Made in Andhra Car: కియా మోటార్స్ ఇండియా నుంచి తొలి కారు 'కియా సెల్టాస్' ఆంధ్ర ప్రదేశ్‌లో విడుదల. ఈ కారు ధర ఎంత, ఇతర విశేషాలు ఎలా ఉన్నాయో చూడండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కియా మోటర్స్ (Kia Motors) నుంచి తొలి 'మేడ్ ఇన్ ఆంధ్ర' (Made in Andhra Pradesh)  కారు కియా సెల్టాస్ (Kia Seltos) గురువారం లాంఛనంగా విడుదలైంది. ఈ కారు ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారయణ, ఏపిఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణి పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాలోని, పెనుగొండకు సమీపాన 2017లో 535 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 8వేల కోట్ల ఖర్చుతో దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్, తమ కార్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే తొలి కారును విడుదల చేయడం విశేషం. ఇప్పటికే ఈ కారు కోసం ఇండియా మొత్తంగా 6 వేలకు పైగా బుకింగ్స్ జరిగాయి.

ఇక ఇండియాలో కియా సెల్టోస్ ధర విషయానికి వస్తే రూ. 10 లక్షల నుంచి రూ. 16 లక్షలకు వరకు వివిధ వేరియంట్లను బట్టి ధరలు ఉండనున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ మరియు మ్యాన్యువల్ ఇలా రెండు వెర్షన్ లలో ఈ కార్ లభ్యం కానుంది. 360 డిగ్రీస్ కెమెరా, సన్ రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్స్ లాంటి ఆప్షన్లు కూడా అందిస్తున్నారు.

 

Kia Seltos Price In India & other specifications:

ఇంజిన్ సామర్థ్యం - 1400 CC సామర్థ్యంతో టర్బో పెట్రోల్ వెర్షన్ మరియు 1500 CC సామర్థ్యంతో పెట్రోల్, డీజిల్ వెర్షన్

పవర్ - 140Ps

టార్క్ - 252Nm

మైలేజ్ - లీటరుకు 16.5 కి.మీ

ఫ్యుయెల్ ట్యాంక్ - పెట్రోల్ లేదా డీజిల్

మాన్యువల్ గేర్లు - 6 లేదా ఆటోమెటిక్ ట్రాన్సిమిషన్ లో 7 గేర్లు.

0 నుంచి 100 కి. మీ వేగం కేవలం 9.7 సెకన్లలోనే అందుకోగలదు.

అంచనా ధర రూ. 10 లక్షల నుంచి 16 లక్షలు (ఎక్స్ షోరూం).