Mumbai, September 24: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా, XUV 300లో కొత్త వేరియంట్ SUV - W6 AMTను విడుదల చేసింది. దీని ధర ఢిల్లీ ఎక్స్ షోరూంలో రూ .9.99 లక్షలు. ఇది డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్ లో మాత్రమే లభ్యమవుతుంది. ఇది మాన్యువల్ లో లభించే W6 AMT కంటే రూ .49,000 అదనం, అయితే ఈ కొత్త SUV - W6 AMT ధర, దీనితో సరిసమానంగా నిలిచే W8 AMT మోడెల్ లో వచ్చిన AMT- XUV300 ధర కంటే రూ. 1.50 లక్షలు తక్కువ. W8 AMT మోడెల్ ధర రూ. 11.50 లక్షల ఎక్స్ షోరూం ధరను కలిగి ఉంది.
AMT గేర్‌బాక్స్‌తో W8 మరియు W8 (O) వేరియంట్ల మాదిరిగానే, ఈ కొత్త SUV - W6 AMT లో కూడా 6-స్పీడ్ ఆటోమేటెడ్ టాన్స్ మిషన్, 1.5-లీటర్, 4-సిలిండర్స్ టర్బో-డీజిల్ ఇంజిన్‌తో ఇవ్వబడింది, ఇది 300 ఎన్ఎమ్ టార్క్ వద్ద 117 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎలాంటి సందర్భాల్లోనైనా దీనిలోని గేర్‌బాక్స్ చాలా త్వరితగతిన స్పందిస్తుంది.
Mahindra XUV300 AMT W6
Introducing autoSHIFT on W6 at just Rs 9.99 Lakhs. Setting the roads on fire is now easier than ever! pic.twitter.com/5mEyDG14uW
— MahindraXUV300 (@MahindraXUV300) September 23, 2019
ఈ కొత్త W6 వేరియంట్ లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) మరియు హిల్-స్టార్ట్ అసిస్టెంట్ వంటి భద్రతా పరమైన వ్యవస్థ కూడా అమర్చారు. దీనివల్ల ఎత్తైనా లేదా కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కారు వెనక్కి జారకుండా మరియు కుదుపులకు లోనుకాకుండా ఉంటుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు సీట్‌బెల్ట్ రిమైండర్‌లు, వేగం పెరిగినపుడు అలర్ట్స్ లాంటి భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ చేస్తున్నపుడు వెనుకవైపు పార్కింగ్ సెన్సార్లు కూడా అమర్చబడి ఉన్నాయి.
ఇక ఇంటీరియర్ విషయాలకు వస్తే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్, స్టీరింగ్-మౌంటెడ్ నియంత్రణలు, నాలుగు స్పీకర్లు లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని రిమోట్ సెంట్రల్ లాకింగ్ మరియు ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్‌లు ప్రత్యేకంగా నిలుస్తాయి.
ఈ కొత్త W6 AMT SUV, మిగతా డీజిల్-ఆటోమేటిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీలైన విటారా బ్రెజా మరియు టాటా నెక్సాన్ లాంటి మోడెల్స్ కు గట్టి పోటీనిస్తుంది.