చెన్నై కేంద్రంగా ద్విచక్ర వాహనాల తయారీ చేపట్టే ప్రముఖ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తన పాపులర్ మోడెల్ అయిన హిమాలయన్ వేరియంట్లో బిఎస్ 6 వెర్షన్ (Bharat Stage VI ) ను విడుదల చేసింది. రూ. 1.86 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈ బైక్ లభించనుంది.
ఆసక్తిగల కస్టమర్లు జనవరి 20 నుండి భారతదేశంలోని అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూంలలో ఈ కొత్త అడ్వెంచర్ టూరర్‌ను బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. భారత్ స్టేజ్ VI కంప్లైంట్ ఇంజిన్‌తో కూడిన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ 3 సంవత్సరాల వారంటీతో కూడా అందిస్తోన్నట్లు పేర్కొంది.
RE హిమాలయన్ (RE Himalayan BS6) మూడు రంగుల షేడ్స్‌లో లభిస్తుంది, ఇందులో డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ కూడా అందుబాటులో ఉంది. లేక్ బ్లూ మరియు రాక్ రెడ్ అనే రెండు డ్యూయల్ టోన్ పెయింట్ తో కూడిన బైక్స్ రూ. 1.91 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తాయి.
ఇక స్నో వైట్, గ్రానైట్ బ్లాక్, స్లీట్ గ్రే మరియు గ్రావెల్ గ్రే కలర్ వేరియంట్ల ధర రూ .1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.
ఇంజన్ పరంగా, కొత్త హిమాలయన్ అడ్వెంచర్ టూరర్ 411 సిసి, బిఎస్ 6 - పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. అయితేఈ బైక్ యొక్క ఖచ్చితమైన పవర్ మరియు టార్క్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ బైక్ లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ తో పాటు 21- / 17-అంగుళాల స్పోక్ వీల్ సెటప్‌ను కలిగి ఉంది. వీటితో పాటు ఎబిఎస్ స్విచ్, హజార్డ్ స్విచ్ లాంటి ఫీచర్లు అదనపు ఆకర్శణ.
ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్ 6 మోడల్, మిగతా కంపెనీల నుంచి విడుదలైన కవాసకి వెర్సిస్ ఎక్స్ -300, బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ మరియు రాబోయే కెటిఎం 390 ఎడివి లాంటి బైక్స్ తో పోటీ పడుతుంది.