సిటీ ట్రాఫిక్ లో ప్రతీ అడుగు దూరానికి గేర్లు మార్చుతూ కష్టపడటం కంటే ఎలాంటి గేర్లు అవసరం లేకుండా సునాయసంగా వెళ్లే స్కూటర్లను ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు. అంతేకాదు, స్కూటర్లు ఆడ, మగ తేడాలేకుండా అందరికీ, అన్ని వయసుల వారు నడిపేటట్లు ఉండటంతో అన్ని చోట్ల వీటి వినియోగం పెరుగుతుంది. వీటి డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి.
మార్కెట్లో 90 సీసీ ఇంజిన్ సామర్థ్యం మొదలుకొని 150సిసి వరకు వివిధ కంపెనీల స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. స్కూటీల అమ్మకాల్లో హోండా కంపెనీ టాప్ గేర్ లో ఉంది. ఎక్కువ మంది జనం హోండా ఆక్టివాను కోరుకుంటున్నారు, తర్వాతి వరుసలో టీవీఎస్ కంపెనీ ఉంది. అయితే అందరికీ అందుబాటు ధరల్లో బెస్ట్ ఫీచర్లతో లభించే కొన్ని స్కూటర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియాలో రూ. 50 వేల లోపే లభించే కొన్ని బెస్ట్ స్కూటర్లు.
హోండా క్లిక్ (Honda Cliq)
హోండా కంపెనీ మరియు స్కూటర్ ఇండియా సంయుక్తంగా హోండా క్లిక్ పేరుతో మిగతావాటి కంటే తక్కువ ధరకే ఓ స్కూటర్ ను విడుదల చేశారు. దీని బరువు కూడా తక్కువే ఉంటుంది. హోండా ఆక్టివా బరువు 103 కిలోలు ఉండగా, ఇది దానికంటే 6 కిలోల తక్కువ బరువు కలిగి 97 సుమారు కిలోలుగా ఉంటుంది.
దీని విశిష్టతలు ఇలా ఉన్నాయి..
CVT ఇంజిన్
ఇంజిన్ సామర్థ్యం - 109.1 సిసి
పవర్ 8 bhp at 7,000 rpm.
టార్క్ 8.94 Nm at 5,5000 rpm
ఎక్స్ షో రూం ధర రూ. 45,000
టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)
టీవీఎస్ కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ ఇది. ఇండియాలో హోండా ఆక్టివా తరువాత ఎక్కువ సేల్స్ ఉన్నది టీవీఎస్ జూపిటర్ కావడం విశేషం. ఈ స్కూటర్ లో ఫ్యుఎల్ క్యాప్ బయటకు ఇచ్చారు కాబట్టి పెట్రోల్ కోసం సీట్ తెరవాల్సిన అవసరం లేదు.
దీని విశిష్టతలు ఇలా ఉన్నాయి..
CVT ఇంజిన్
ఇంజిన్ సామర్థ్యం - 109.7 సిసి
పవర్ 7.88 bhp at 7,500 rpm.
టార్క్ 8.4 Nm at 5,5000 rpm
ఎక్స్ షోరూం ధర రూ. 49,500
హోండా ఆక్టివా-ఐ (Honda Activa-i)
హోండా కంపెనీ నుంచి వచ్చే స్కూటర్లలో ఆక్టివా ఐ పాపులర్ మోడెల్. ఈ స్కూటర్ కొన్ని చిన్న చిన్న మార్పులు మినహా దాదాపు హోండా ఆక్టివా లాగే ఉంటుంది. అయితే హోండా ఆక్టివా మెటల్ బాడీతో వస్తే ఆక్టివా ఐ ఫైబర్ బాడీతో అందిస్తున్నారు. కాబట్టి బరువు కూడా తక్కువగానే ఉంటుంది.
CVT ఇంజిన్, సింగిల్ సిలిండర్ - ఎయిర్ కూల్డ్.
ఇంజిన్ సామర్థ్యం - 109.1 సిసి
పవర్ 8 bhp at 7,000 rpm.
టార్క్ 8.94 Nm at 5,5000 rpm
ఎక్స్ షోరూం ధర రూ. 47,900
హోండా డియో (Honda Dio)
స్కూటర్లన్నింటిలో హోండా డియో చూడటానికి చాలా స్టైలిష్ గా, ట్రెండీగా ఉంటుంది. యూత్ ఎక్కువగా ఈ స్కూటీని కొనడానికి ఇష్టపడుతుంటారు. దీనిలోని ఫీచర్స్ ఆక్టివా ఐ లాగే ఉంటాయి. బరువు కూడా దానితో సమానంగా 103 కిలోలు ఉంటుంది.
CVT ఇంజిన్
ఇంజిన్ సామర్థ్యం - 109.1 సిసి
పవర్ 8 bhp at 7,000 rpm.
టార్క్ 8.91 Nm at 5,5000 rpm
ఎక్స్ షోరూం ధర రూ. 49,100
టీవీఎస్ స్కూటీ జెస్ట్ (TVS Scooty Zest)
టీవీఎస్ నుంచి మరో అద్భుతమైన స్కూటర్ ఇది. ఇది సొగసైన లుక్స్ తో, ఫీచర్లతో ఆకర్శణీయంగా ఉంటుంది. దీని లోపల స్టోరేజ్ సామర్థ్యం కూడా 19 లీటర్లుగా ఉంది. ట్యూబ్ లెస్ టైర్లు, బరువు కూడా 98 కిలోలు ఉండి రోడ్డుపై చాలా బ్యాలెన్స్ తో ప్రయాణించేలా ఉంటుంది.
CVT ఇంజిన్
ఇంజిన్ సామర్థ్యం - 109.7 సిసి
పవర్ 7.88 bhp at 7,500 rpm.
టార్క్ 8.4 Nm at 5,5000 rpm
ఎక్స్ షోరూం ధర రూ. 46,500/-