హైదరాబాద్, జనవరి 23: కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ షాకిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ రోజు ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.47,530 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530 గా ఉంది. తులం బంగారంపై రూ.110 మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,530 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,530 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 వద్ద కొనసాగుతోంది. ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది.