SBI Interest Rates: వడ్డీ రేట్లను తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గృహ మరియు వాహనాల కొనుగోళ్లపై తక్కువ వడ్డీకే రుణాలు
State Bank of India | (Photo Credits: IANS)

Mumbai, February 7:  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తన నిధుల ఆధారిత రుణ రేటు యొక్క మార్జినల్ (MCLR) లేదా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను ఎస్బీఐ (SBI Interest Rates) తగ్గించడం ఇది తొమ్మిదో సారి. ఈ కొత్త రేట్లు ఫిబ్రవరి 10 నుండి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. ఈ తాజా తగ్గింపుతో గృహ మరియు వాహన రుణాలపై వడ్డీ మరింత తక్కువ కానుంది.

ఫిక్స్‌డ్ లేదా టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ చెల్లించే వడ్డీ రేట్లను కూడా తగ్గించే నిర్ణయం ఎస్బీఐ తీసుకుంది. ఎఫ్డి రేట్లను 50 బేసిస్ పాయింట్ల వరకు (0.5 శాతం పాయింట్) తగ్గించింది. దీనిని "వ్యవస్థలో మిగులు ద్రవ్యత" అని పేర్కొంది. వీటికి కూడా కొత్త రేట్లు ఫిబ్రవరి 10 నుండి వర్తిస్తాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ద్రవ్య విధానంపై యథాతథ స్థితిని కొనసాగించిన ఒక రోజు తర్వాత దేశంలో అతిపెద్ద రుణదాత అయిన ఎస్బీఐ ఈ చర్య తీసుకుంది.

తాజా అభివృద్ధి ప్రకారం, ఎస్‌బీఐ ఎంసిఎల్‌ఆర్‌ టేనర్‌లలో 5 బేసిస్ పాయింట్లు తగ్గడం గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తుంది. అంతకుముందు 8 శాతంగా  ఉన్న  ఎంసిఎల్ఆర్  రేటు,  ప్రస్తుతం 7.90 గా ఉంది.  తాజా తగ్గింపుతో 7.85 శాతంకు చేరుకుంటుంది.  ఇకపై ఎస్బీఐ ఏటిఎంలలో క్యాష్ విత్‌డ్రాకు ఓటీపీ ఎంటర్ చేయాలి

ఫిబ్రవరి 10 నుండి రిటైల్ ఎఫ్‌డి రేట్లను 10-50 బేసిస్ పాయింట్లు, బల్క్ ఎఫ్‌డి రేట్లను 25-50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తామని బ్యాంక్ తెలిపింది.

రుణ వృద్ధిని పెంచే ప్రయత్నంలో, ఆర్‌బీఐ గురువారం అనేక తాత్కాలిక చర్యలను ప్రవేశపెట్టింది. ఈ చర్యలు వినియోగదారులకు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకుల విశ్వాసాన్ని పెంచుతాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.